గత మూడు రోజుల కిందట వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ ను ఐసీసీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఇండియాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. దీంతో ఎలాగైనా ఈసారి వన్డే వరల్డ్ కప్ కొట్టాలని టీమిండియా భావిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే.
Advertisement
ఇలాంటి తరుణంలో బీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు చైనాలో జరిగే ఆసియా క్రీడలలో తమ జట్లను కూడా దించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ క్రీడాలలో మహిళల టీమిండియాను అలాగే పురుషుల టీమిండియాను కూడా ఆడించేందుకు పంపించనుంది బీసీసీఐ. అయితే చైనాలో జరిగే ఈ క్రీడాలకు పురుషుల టీమిండియా బీ జట్టును పంపేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.
Advertisement
అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… మెయిన్ టీం ఇండియాను పంపకుండా… టీమిండియా B జట్టును పంపనుంది. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ప్రకటించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతుంది. శిఖర్ ధావన్ ను కెప్టెన్ చేసి ఆ జట్టును చైనాకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన జట్టు ఇండియాలోనే ఉండి… వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం కానుంది.
ఇవి కూడా చదవండి
Sanju Samson : అయ్యర్ ఔట్.. 7 నెలల తర్వాత శాంసన్ రీఎంట్రీ..ఇకపై వరుసగా ఛాన్స్‌లే..?
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
Ram Charan – Upasana : రాంచరణ్ కూతురు పేరు ‘క్లింకారా కొణిదెల’ అసలు ఈ పేరుకి అర్థం ఏమిటంటే!