Home » త్వరలో హీరో శర్వానంద్ పెళ్లి…అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

త్వరలో హీరో శర్వానంద్ పెళ్లి…అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. కేవలం ఒకే రకమైన పాత్రలు కాకుండా విభిన్న చిత్రాలలో నటిస్తూ శర్వానంద్ అభిమానులు సంపాదించుకున్నారు. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాల్లో నటించారు. నాచురల్ గా నటించడంతో శర్వానంద్ కు తెలుగులో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే శర్వానంద్ టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ల లిస్ట్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు శర్వా ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. గతం లో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ ఈ సారి మాత్రం శర్వా పెళ్లి జరగటం పక్కా అని సమాచారం.

Advertisement

ఇక శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరో కూడా తెలిసిపోయింది. ఈ నెల 26న శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరగనుంది. అంతే కాకుండా శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షితా రెడ్డి అని సమాచారం. అమ్మాయి తండ్రి హైకోర్టు న్యాయవాది మధు సూదన్ రెడ్డి అని తెలుస్తోంది. అంతే కాకుండా రక్షిత రెడ్డి తాత ఏపి మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ రెడ్డి అని సమాచారం.

Visitors Are Also Reading