ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుక శనివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన రాజారెడ్డి, ప్రియా పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. నూతన దంపతులను వైఎస్ షర్మిల-బ్రదర్ అనిల్ దంపతులు, ప్రియా అట్లూరి తల్లిదండ్రులు, వైఎస్ విజయమ్మ ఆశీర్వదించారు. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఐతే జగన్ మాత్రం హాజరుకాలేదు.
Advertisement
ఇటు వైఎస్ జగన్ గానీ.. అటు భారతి గానీ.. పెళ్లి వేడుకలో కనిపించలేదు. కవిజయమ్మ మాత్రమే వెళ్లారు. గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల.. తన సోదరుడు జగన్‌ను టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లికి వెళ్లకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజారెడ్డి, ప్రియా నిశ్చితార్ధం జనవరి 18న గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో జరిగింది. ఆ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వెళ్లి ఆశీర్వదించారు. వైఎస్ జగన్ కూడా వెళ్లినా.. అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం.. వై.ఎస్.జగన్ పై విమర్శలు చేయడం వంటి కారణాలతోనే ఏపీ సీఎం జగన్ అల్లుడి పెళ్లికి హాజరు కాలేదని తెలుస్తోంది.
Advertisement
మరోవైపు ఇవాళ సిద్ధం సభ ఉండటం కారణంగానే ‘సీఎం జగన్ హాజరు కావడం లేదని.. సీఎం జగన్ హాజరు కాకపోవడంతో భారతీ కూడా హాజరు కావడం లేదని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే.. గత నాలుగేళ్లుగా రాజారెడ్డి, ప్రియా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమ గురించి ఈ మధ్యే ఇరు కుటుంబాల్లో తెలిసింది. ఇటు షర్మిల-అనిల్ దంపతులు..అటు ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకారం తెలపడంతో.. వివాహ వేడుక ఘనంగా జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటిలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు. యూనివర్సిటీ నుంచి ఇప్పటికే పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా వెళ్లారు.
Also Read : Sr ఎన్టీఆర్ కి ఉపాసన గారి తాతయ్య చేసిన సహాయం ఏంటో తెలుసా !