Home » Sr ఎన్టీఆర్ కి ఉపాసన గారి తాతయ్య చేసిన సహాయం ఏంటో తెలుసా !

Sr ఎన్టీఆర్ కి ఉపాసన గారి తాతయ్య చేసిన సహాయం ఏంటో తెలుసా !

by Anji
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన నిశ్చితార్థం డిసెంబర్ 01, 2011న టెంపుల్ ట్రీట్ ఫామ్ హౌస్ లో జరిగింది. వీరి నిశ్చితార్థం జరిగేంత వరకు కూడా ఉపాసన గురించి ఎవ్వరికీ అంతగా తెలియదు. ఎంగేజ్ మెంట్ సమయంలోనే వీరి గురించి తెలిసింది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారని.. అదికూడా కులాంతర వివాహం కావడం అప్పట్లో వార్తలో నిలిచింది. కానీ ఆ ఫంక్షన్ లో ఉపాసనని చూసి చాలా అనుకున్న మాట.. ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది..? మరీ ఇలా ఉన్న అమ్మాయిని చిరంజీవి కోడలుగా ఎలా చేసుకుంటున్నారా..? అంటూ రకరకాల వినిపించాయి. ఉపాసన వివాహం రామ్ చరణ్ తో 2012 జూన్ 14న జరిగింది.

sr-ntr

Advertisement

 

పెళ్లి అయిన 11 ఏళ్లకు 2023 జూన్ 20న తెల్లవారుజామున క్లీంకారకి జన్మనిచ్చింది ఉపాసన.  అయితే ఉపాసన అత్తగారింటి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. కానీ ఉపాసన తాతయ్య ప్రతాప్ రెడ్డి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఉపాసన తాతయ్య అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ చందర్ రెడ్డి 1933లో జన్మించారు. 90 ఏళ్లు దాటాయి. ప్రపంచ ప్రఖ్యాత గుండె వైద్య నిపుణులు. భారతదేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించి 1983 సెప్టెంబర్ లో స్థాపించాడు. చెన్నైలోని స్టాన్ లే మెడికల్ కళాశాలో చదివాడు. ఆ తరువాత అమెరికా, ఇంగ్లండ్ వెళ్లి మెరుగైన వైద్యాన్ని నేర్చుకున్నాడు. ఇదే తరుణంలో ఆయనకు సుచరితతో పెళ్లి జరిగింది.నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ప్రతాప్ రెడ్డిది చిత్తూరు జిల్లా. వీరి తండ్రి వారి గ్రామానికి భూస్వామిగా ఉండేవారు.

Advertisement

 

ప్రతాప్ రెడ్డికి ఇద్దరూ అక్కలు, ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెలు. హై స్కూల్ లో ఉన్నప్పుడు ఏదో సాధించాలనే బలమైన కోరిక ఉండేది. తొమ్మిదేళ్ల వయస్సులోనే గాంధీజీ ఉపన్యాసం విన్నారు.  అప్పట్లో పోలీసులు  ప్రతాప్ రెడ్డిని  జైలుకు తరలించారు. ప్రతాప్ రెడ్డి తాతయ్య పోలీస్ స్టేషన్ రాగానే వదిలివేశారు పోలీసులు. ప్రతాప్ రెడ్డి స్టూడెంట్ యూనియన్ కి లీడర్ గా కూడా వ్యవహరించాడు. ప్రతాప్ రెడ్డి మంచి డాక్టర్ గా ఎదిగి తండ్రికి ఫోటోలు పెట్టారు. తండ్రి రాఘవరెడ్డి ఓ ఉత్తరం రాశారు.. నీ పొటోలు చూస్తే.. చాలా ఆనందంగా ఉంది. కానీ నువ్వు చేసే వైద్యం భారతదేశంలో చేయవచ్చు కదా అని అడిగాడట. వెంటనే తండ్రి మాట విని హైదరాబాద్ కి వచ్చేశారు ప్రతాప్ రెడ్డి.

 

భారతదేశం వచ్చిన తొలుత చిన్న రూమ్ లో తక్కువ ఫీజుతో క్లినిక్ ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించాడు. 1983 సెప్టెంబర్ లో చెన్నైలో అపోలో ఆసుపత్రిని ప్రారంభించారు. అపోలో అనే పేరును ప్రతాప్ రెడ్డి రెండో కుమార్తె సునితారెడ్డి సూచించారు. అపోలో అంటే గ్రీకు భాషలో సూర్యభగవానుడు అని అర్థం. అమెరికాకు చెందిన డెంటన్ కూలీని తన వైద్య గురువుగా భావిస్తారు. కూలీ గారే ప్రపంచంలో మొట్టమొదటి కృతిమ గుండెను అమర్చారు.  ఆరోజుల్లో ఎన్టీఆర్ కూడా కూలీ గారిదగ్గరికి వైద్యం కోసం వెళ్లారు.  అయితే అప్పుడు ఎన్టీఆర్ సరిగ్గా 9.11 గంటలకు  గుండెకి సంబంధించిన సర్జరీ చేయాలని కూలీ గారిని ఓ సమయంలో కోరాడట. ఆ సమయానికి నాకు కుదరదు అని.. నీ సమయం వచ్చినప్పుడు చేస్తానని చెప్పాడట. ఎన్టీఆర్ ప్రతాప్ రెడ్డి సన్నిహితుడు అని తెలుసుకొని ప్రతాప్ రెడ్డి సూచన మేరకు   ఎన్టీఆర్ కోరిన సమయంలోనే ఆ సర్జరీని విజయవంతంగా చేశారట డాక్టర్ డెంటన్ కూలీ. ఆ తరువాత పీవీ నరసింహారావు కి కూడా గుండె సంబంధిత చికిత్స అవసరం అయినప్పుడు ప్రతాప్ రెడ్డి సిఫారసుతోనే కూలి గారి దగ్గరికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు.

Also Read : మనదేశం సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన ముగ్గురు లెజెండ్స్ ఎవరో చెప్పగలరా ?

Visitors Are Also Reading