Home » అన్న కనిపించకుండా జాగ్రత్త పడిన షర్మిల.. వీడియోలో ఒక్క చోట కూడా జగన్ లేడుగా!

అన్న కనిపించకుండా జాగ్రత్త పడిన షర్మిల.. వీడియోలో ఒక్క చోట కూడా జగన్ లేడుగా!

by Srilakshmi Bharathi
Ad

షర్మిల కుమారుడి నిశ్చితార్థం నిన్న రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగిందన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి భారతితో పాటు సీఎం వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం, నిన్న రాత్రి జరిగిన నిశ్చితార్థానికి సంబంధించిన ఎడిట్ వీడియోను వైఎస్ షర్మిల షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

వైఎస్ షర్మిల కుటుంబానికి చెందిన ముఖ్య వ్యక్తులతో సహా వైఎస్ కుటుంబంలోని ముఖ్యమైన సభ్యులను వీడియో కవర్ చేస్తుంది. అయితే ఈ వీడియోలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి కనిపించడం లేదు. వారిద్దరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ వీడియోలో వారి ఆనవాళ్లు మచ్చుకైనా కానరాలేదు. దీనితో జగన్ అభిమానులు, వై ఎస్ అభిమానులు కొంత అప్ సెట్ అయ్యారు. కెమెరాకు ఫోజులివ్వడానికి షర్మిల ముందుకు రావాలని జగన్ పిలిచినా స్పందించలేదు.

Advertisement

జగన్ మోహన్ రెడ్డి రెండు సార్లు పిలిచినా షర్మిల స్పందించలేదు. ఇక విజయమ్మ ఊరుకోక గట్టిగ చెప్పడంతోనే వారు అనిల్ కుమార్, షర్మిలలు ముందుకు వచ్చారు. అది కూడా వరుసలో చివరలో నుల్చుని ఫోటో దిగారు. ఈ ఫంక్షన్ లో జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ సేపు ఉండలేదు. ఉన్నంతసేపు కూడా ఆయన ముభావంగానే ఉన్నారు. షర్మిలకి జగన్ ఒక్కడే సోదరుడు, రాజా రెడ్డికి మామ అని ఆయనను వీడియోలో చేర్చి ఉండొచ్చు. కానీ ఈ వీడియోలో ఆయన కనిపించలేదు మరియు అది జగన్ మరియు షర్మిల కుటుంబాల మధ్య పెరుగుతున్న దూరాన్ని మరింతగా చూపిస్తున్నట్లు అయ్యింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading