Home » దీప్తితో బ్రేకప్..మ‌రో అమ్మాయితో గృహ‌ప్ర‌వేశం..వైర‌ల్ అవుతున్న ష‌ణ్ముక్ ఫోటోలు..!

దీప్తితో బ్రేకప్..మ‌రో అమ్మాయితో గృహ‌ప్ర‌వేశం..వైర‌ల్ అవుతున్న ష‌ణ్ముక్ ఫోటోలు..!

by AJAY
Ad

యూట్య‌బ్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న‌వారిలో ష‌ణ్ముక్ జ‌శ్వంత్ కూడా ఒక‌రు. ష‌ణ్ముక్ క‌వ‌ర్ సాంగ్స్…షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ‌ర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాకుండా సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప‌ర్ వెబ్ సిరీస్ తో ష‌ణ్ముక్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇక ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ష‌ణ్ముక్ ను బిగ్ బాస్ కూడా ఆహ్వానించింది.

shanmukh srividya

shanmukh srividya

అలా బిగ్ బాస్ సీజ‌న్ 5 లోకి ష‌ణ్ముక్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షో ష‌ణ్ముక్ కొంప ముంచింది అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు. అప్ప‌టికే దీప్తితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న ష‌ణ్ముక్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత సిరి హ‌న్మంతుకు క్లోజ్ అయ్యాడు. వీరిద్దరిదీ ఫ్రెండ్ షిప్ అయినా కూడా హ‌గ్గులు ముద్దుల‌తో హ‌ద్దులు మీరిన‌ట్టు బ‌య‌ట‌కు క‌నిపించింది.

Advertisement

Advertisement

సిరి తల్లి కూడా కాస్త దూరంగా ఉండాలంటూ ష‌ణ్ముక్ కు చెప్ప‌డం మ‌రో హాట్ టాపిక్ ఇక ఇదంతా చూసిన ష‌ణ్ముక్ గ‌ర్ల్ ఫ్రెండ్ దీప్తి సున‌నై అత‌డు హౌస్ నుండి బ‌య‌ట‌కు రాగానే క‌టిఫ్ చేసింది. మాట్లాడ‌టం మానేసింది..వాట్స‌ప్ లో బ్లాక్ చేసింది. దాంతో ఇద్ద‌రూ విడిపోతున్నారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి. అంతా అనుకున్న‌ట్టే ఇద్ద‌రూ తాము విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ష‌ణ్ముక్ మ‌రో అమ్మాయితో గృహ ప్ర‌వేశం చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ష‌ణ్ముక్ తో క‌లిసి గృహ ప్ర‌వేశం చేసిన అమ్మాయి ఎవ‌రో కాదు. చాయ్ బిస్కెట్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిద్య‌…అంతే కాదు వీరిద్ద‌రూ క‌లిసి ప్ర‌స్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోలే నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Visitors Are Also Reading