Telugu News » Blog » ఆమెకు హ‌క్కుంది..ఆల్ ద బెస్ట్ దీపూ అంటూ ష‌ణ్ముక్ భావోద్వోగం..!

ఆమెకు హ‌క్కుంది..ఆల్ ద బెస్ట్ దీపూ అంటూ ష‌ణ్ముక్ భావోద్వోగం..!

by AJAY
Ads

సినిమా తార‌ల బ్రేక‌ప్ లే కాకుండా ఇప్పుడు సోష‌ల్ మీడియా సెలబ్రెటీల బ్రేక‌ప్ లు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిజానికి దీప్తి సున‌య‌నా, ష‌ణ్ముక్ జ‌శ్వంత్ ఇద్ద‌రూ సోష‌ల్ మీడియా ద్వారానే పాపులారిటీ సంపాదించినప్ప‌టికీ బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో కి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. కాబ‌ట్టి వారి బ్రేక‌ప్ కూడా హాట్ టాపిక్ గా మారింది. వీరిద్ద‌రి బ్రేకప్ కు కార‌ణం బిగ్ బాస్ హౌస్ లో ష‌ణ్ముక్ చేసిన ఓవ‌రాక్ష‌నే అని నెటిజ‌న్లు అనుకుంటున్నారు.

deepthi sunaina shanmuk breakup

ష‌ణ్ముక్ సిరి ముద్దులు పెట్టుకోవ‌డం, హ‌గ్గులు ఇచ్చుకోవ‌డం వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇక కొద్ది రోజుల నుండి దీప్తి ష‌ణ్ముక్ ల బ్రేక‌ప్ పై గుస‌గుస‌లు వినిపించ‌గా దీప్తి సునైనా తాము విడిపోయామంటూ అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ సుధీర్గ‌మైన పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో దీప్తి ఎమోష‌న‌ల్ అయ్యింది. ష‌ణ్ముక్ తాను విడిపోతున్నామ‌ని…ఐదేళ్లలో సంతోషంతో పాటు మ‌రెన్నో ఉన్నాయని పేర్కొంది. కానీ త‌మ‌లో ఉన్న రాక్ష‌సులు విడిపోవాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు తెలిపింది. ఇక తాజాగా మొద‌టి సారి ష‌ణ్ముక్ కూడా బ్రేక‌ప్ పై స్పందించాడు.

Also read : బంగారంలా మెరిసిపోతున్న బాల‌య్య హీరోయిన్…ఫోటోలు వైర‌ల్..!

దీని పై నిర్ణ‌యం తీసుకునే పూర్తి అధికారం ఆమెకు ఉంద‌ని పేర్కొన్నాడు. ఇప్ప‌టికే తాను చాలా అనుభ‌వించింద‌ని పేర్కొన్నాడు. చివ‌ర‌గా తాను దీప్తి హ్యాపీగా పీస్ పుల్ గా ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు తెలిపాడు. త‌మ దారులు వేరైనా క‌లిసి ఉండామ‌ని పేర్కొన్నాడు. ఐదేళ్లు న‌న్ను బెట‌ర్ ప‌ర్స‌న్ ను చేసేందుకు స‌హ‌క‌రించినందుకు థాంక్యూ అంటూ ష‌ణ్ముక్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. నువ్వు సంతోషంగా ఉండాలి ఆల్ ద బెస్ట్ దీపూ అంటూ ష‌ణ్ముక్ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు.


You may also like