ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకస్మాత్తుగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పుడు మృతి మలుపులు తిరిగే విధంగా కనిపిస్తోంది. స్నేహితులతో కలిసి హాలీడేస్ థాయిలాండ్ వచ్చిన వార్న్ శుక్రవారం మరణించినట్టు క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. పొద్దుపోతున్నా డిన్నర్‌కు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితుడు వార్న్ రూమ్‌కు వెళ్లే సరికి అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో కంగారు పడ్డ అతను సీపీఆర్ ద్వారా వార్నర్‌ను బతికించే ప్రయత్నం చేశాడు.
ఫలితం లేకపోవడంతో వెంటనే థాయ్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్టు ప్రకటించారు. వార్న్ గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించినట్టు వైద్యులు కూడా ధువీకరించారు. అయితే వార్న్ మృతిపై దర్యాప్తు ప్రారంభించిన థాయ్ పోలీసులు తాజాగా వార్న్ ఉన్న విల్లాలోని గదిని పరిశీలించారు. ఈ రూమ్‌లోరక్తపు మరకలు, బాత్ టవల్స్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో వార్న్ మృతిపై ఒక్కసారిగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్కైన్యూస్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ముఖ్యంగా వార్న్ గదిలో పెద్ద మొత్తంలో రక్తపు మరకలను గుర్తించినట్టు స్థానిక ప్రావిన్షియల్ పోలీసులు వెల్లడించినట్టు థాయ్ మీడియా కూడా పేర్కొన్నది. ఈ రక్తపు మరకల వెనుక అనుమానించాల్సినది ఏమి లేదని.. అతనికీ సీపీఆర్ ప్రారంభించినప్పుడు రక్తపు వాంతి చేసుకుని ఉంటాడని, గదిలో ఉన్న రక్తపు మరకలు అవే అయి ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. వార్న్ తాను చనిపోవడానికి ముందు ఓ వైద్యుని వద్ద పరీక్షలు కూడా చేయించుకున్నాడు అని.. అతని గుండెను కూడా పరీక్షించాడని కో స్యామూస్ బో పుట్ పోలీస్ స్టేషన్ సూపరింటెండెంట్ తెలిపారు. ఆ సమయంలో అతని శరీరంలో ఎలాంటి డ్రగ్స్‌ను గుర్తించలేదని చెప్పారు. దీంతో వార్న్ మృతిని అనుమానస్పందంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.
Also Read : Russia Ukraine War : ఉక్రెయిన్‌లో అతిపెద్ద సంక్షోభం..!