ఉక్రెయిన్ రష్యా మిలటరీ అధికారులు వరుసబెట్టి దాడులు చేస్తుండటంతో ఉక్రెయిన్ ప్రజలు తమ దేశాన్ని విడిచి వలస వెళ్లిపోతున్నారు. రష్యా దాడులు ప్రారంభించిన తరువాత ఇప్పటివరకు రూ.15లక్షల మంది వలస వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరవాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న వలసై సంక్షోభం ఇదేనని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశమైన మాల్డోవాకు శరణార్థులు పోటెత్తుతున్నారు. గత 11 రోజుల వ్యవధిలో 2.30 లక్షల మంది మాల్డో వాలోకి ప్రవేశించినట్టు అధికారులు వెల్లడించారు.
ఉక్రెయిన్ చాలా మంది ప్రజలు సెంట్రల్ బుడా ఫెస్ట్ నగరంలోని న్యుగటి రైల్వే స్టేషన్ గుండా దేశ సరిహద్దులకు చేరుకుని అక్కడి నుండి పక్క దేశాలకు వలస వెల్లిపోతున్నారు. సరిహద్దులకు చేరుకుంటున్న వలస దారులకు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారం, వస్తువులను వలస దారులకు సరఫరా చేస్తున్నారు. మరికొందరూ శరణార్థులు జకర్ పట్టియా ఒబ్లాస్ట్ నుంచి తూర్పు ఉక్రెయిన్‌లోని సరిహద్దు గుండా వలస వెళ్తున్నారు. నల్ల సముద్రంలోని ఓడరేవు నగరం అయిన ఒడెస్సా నుంచి కూడా కొందరూ శరణార్థులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
Also Read : INDW vs PAKW : పాకిస్తాన్ పై భారత్ 11వ విజయం.. వారి పాత్ర కీలకం..!