ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో పర్యాటకం ముసుగులో కొందరూ పర్యాటకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్థానికులు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. బాలి ద్వీపంలో దాదాపు 90 శాతం వరకు హిందువులే ఉండడం విశేషం. ఈ దీవిలోని పలు పర్వతాలను చాలా పవిత్రంగా పూజిస్తారు. ఈ పర్వతాలను దేవతలు, తమ పూర్వీకులు ఉండే ప్రాంతాలుగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇవేమి పట్టించుకోకుండా ఇతర దేశాల టూరిస్టులు చేస్తున్నటువంటి కొన్ని పాడు పనులు తమ సంప్రదాయాలను, విశ్వాసాలను ఘోరంగా అవమానిస్తున్నాయని వాపోతున్నారు.
Advertisement
బాలిలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే బాటూర్ శిఖరంతో పాటు ఇతర పర్వతాలకు టూరిస్టుల తాకిడి పెరిగింది. ఇక్కడి నుంచి సూర్యోదయ దృశ్యాలను చూసేందుకు స్థానికులతో పాటు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. విదేశీ టూరిస్టులు ఈ పర్వతాలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. పర్వతాలపై వారందరూ సమూహంగా చేరడం,కొందరూ na గ్నంగా నృత్యాలు చేయడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే ఇలా నృత్యాలు చేయడంతో కెనడా పర్యాటకుడిని బలవంతంగా వెనక్కి పంపించేశారు. మరోవైపు రష్యాకి చెందిన ఓ నటి అస*కరంగా ప్రవర్తించినట్టు వార్తలు వినిపించాయి.
Advertisement
ఈ వ్యవహారంపై స్పందించిన బాలి గవర్నర్ కొత్త నియమావళిని జారీ చేసారు. పర్వతాలను పవిత్రమైనవిగా గుర్తుంచడంతో పాటు వాటి పవిత్రతకు భంగం కలిగిస్తే.. కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. బాలిలో పర్వతాలపై దూషణలు చేస్తే వాటిని నేరంగానే పరిగణిస్తారు. పర్యాటకులు స్థానిక సంప్రదాయాలను గౌరవించడంతో పాటు స్థానిక చట్టాలను పాటించాలని అధికార వర్గాలు విజ్ఞప్తి చేసాయి. అన్ని చట్టాలను పాటిస్తామని హామీ ఇస్తేనే వారిని బాలిలోకి అనుమతించాలని స్థానికులు సూచించారు. పర్యాటక రంగంపై ఆధారపడి ఉన్న వారి జీవన భృతికి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్థానిక అధిక యంత్రాంగం హామీ ఇచ్చింది.
Also Read : గత పదేళ్లుగా టెస్టుల్లో టీమిండియా తిరుగులేని రికార్డులు ఇవే..!