Home » నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ? 

నయనతార భర్తకు షారూఖ్ ఖాన్ వార్నింగ్.. అందుకోసమేనా ? 

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న వారిలో నయనతార-విఘ్నేష్ శివన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నయనతార-విఘ్నేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విధితమే. 2017లో నానుమ్ రౌడి థాన్ మూవీ సెట్స్ లో మొదటిసారి విఘ్నేష్- నయనతార కలుసుకున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Advertisement

ఇక ఆ తరువాత చాలా కాలం పాటు డేటింగ్ చేసి.. 2021లో నయనతారకు నిశ్చితార్థ ఉంగరం తొడిగారు విఘ్నేష్ శివన్. 2022 జూన్ 09న మహాబలిపురం సమీపంలోని ఓ రిసార్ట్ లో పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా వీరి పెళ్లి జరిగింది. అనంతరం సరోగసి ద్వారా 2022 అక్టోబర్ 09న కవల మగ పిల్లలను పొందారు. ఇదిలా ఉండగా.. నయనతార ప్రస్తుతం నటిస్తున్న సినిమా జవాన్. స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు. ఇటీవలే విడుదలైన జవాన్ ప్రివ్యూ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. 

Advertisement

ఈ తరుణంలో నయనతార భర్త విఘ్నేష్.. సోషల్ మీడియా వేదికగా జవాన్ మూవీ టీమ్ కి విషెష్ తెలుపుతూ ఓ నోట్ షేర్ చేసాడు. ఈ స్పెషల్ నోట్ కి షారూఖ్ ఖాన్ రిట్వీట్ చేస్తూ.. రిప్లై ఇచ్చాడు. విఘ్నేష్ శివన్ మా సినిమాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. నయనతార చాలా టాలెంటేడ్ యాక్టర్స్.. అయితే నేను మాత్రం మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయేది మీకు ముందే తెలుసు అనుకుంటాను.. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆమె ఇప్పుడు కొన్ని భారీ కిక్స్, పంచ్ లు నేర్చుకుంది. సో జాగ్రత్తగా ఉండు బ్రదర్” అని ఫన్నీగా విఘ్నేష్ శివన్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్‌ మూడో భార్య ఎవరో తెలుసా..? వారి ప్రేమ ఎక్కడ పుట్టిందంటే !

హీరోల బిహేవియర్‌ వల్ల సినిమాలనే వదిలేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..?

Visitors Are Also Reading