Home » వీధి కుక్కల దాడిలో.. ఏడు నెలలు బాలుడు మృతి..!

వీధి కుక్కల దాడిలో.. ఏడు నెలలు బాలుడు మృతి..!

by Sravya
Ad

కుక్కల తో జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల్ని వీధి కుక్కలు తిరిగే చోట ఉంచకూడదు. కుక్కలు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటువంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలో ఏడు నెలల బాలుడి మీద వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన బుధవారం నగరం లో అయోధ్య నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ని పోలీసులు ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.

Advertisement

Advertisement

పిల్లాడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు పోలీసులు మళ్ళీ మృతదేహాన్ని వెతికి తీశారు శనివారం పోస్టుమార్టం కోసం పంపించారు. తల్లి పిల్లాడిని నేల మీద పడుకోబెట్టి పక్కనే పని చేసుకుంటుండగా ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. కుక్కల గుంపు చిన్నారి ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోయాయి. కుక్కల దాడిలో శిశువు శరీరం నుండి చెయ్యి విడి పోయింది దీంతో అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు చెప్పారు. జిల్లా యంత్రాంగం బాలుడి కుటుంబానికి 50 వేల రూపాయలని ఆర్థిక సహాయంగా ఇచ్చారు. మరో 50 వేలను త్వరలో అందిస్తామని అధికారులు చెప్పారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading