Home » బాలయ్య డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా..ఏంటో తెలుసా..?

బాలయ్య డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్ సినిమా..ఏంటో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. అలాంటి ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

Advertisement

అయితే తన కొడుకు బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్లో 12 సినిమాల వరకుతెరకెక్కాయ్. ఇందులో ఏడు సినిమాలకు ఎన్టీఆర్ డైరెక్షన్ చేశారు. అయితే తండ్రి చెప్పిన మాటను బాలయ్య ఎప్పుడు కూడా ధిక్కరించే వారు కాదు. ఆయన ఏం చెప్పినా చేసేవాడు. సీనియర్ ఎన్టీఆర్ సెట్ లోకి వచ్చాడు అంటే చాలు బాలయ్య సైలెంట్ అయ్యారు. ఇకపోతే ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఓ సినిమాకు ఎన్టీఆర్ బాలకృష్ణను డైరెక్షన్ చేయాలని చెప్పాడు.

Advertisement

అంతేకాదు ఈ షూటింగ్ అతి తక్కువ కాలంలో ఫినిష్ చేయాలని షరతు పెట్టాడు. కొంతకాలం డైరెక్షన్ చేసిన బాలకృష్ణ షూటింగ్ వేగంగా తీసుకోలేకపోయారు. దీంతో ఆయన దర్శకత్వం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆరే దీనికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరు అశోక్ సామ్రాట్.

also read:

 

 

Visitors Are Also Reading