Home » రక్తం కారుతుంటే ఎన్టీఆర్ మిరపకాయలు ఎందుకు నమిలారు….ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

రక్తం కారుతుంటే ఎన్టీఆర్ మిరపకాయలు ఎందుకు నమిలారు….ఎవ్వరికీ తెలియని నిజాలు ఇవే..!

by AJAY
Published: Last Updated on
Ad

ఎన్టీ రామారావు ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. తెలుగు సినిమాకు తెలుగుజాతికి ఎన్టీఆర్ గొప్ప సేవ చేశారని చెప్పాలి. హీరోగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సీఎం గాను ప్రజల మనసు దోచుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఆయన క్రమశిక్షణ ప‌ట్టుద‌లే కారణం అని ఆయ‌న సన్నిహితులు చెబుతుంటారు.

Advertisement

 

ఎన్టీరామారావు క్రమశిక్షణ గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలను తీసుకోవచ్చు. అందులో ఒకటి ఆయనకు షూటింగ్లో రక్తం కారుతున్న తట్టుకుని షూటింగ్ పూర్తి చేయడమే. ఎన్టీ రామారావు నటించిన సూపర్ హిట్ సినిమాలలో ఎదురీత సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను బెంగాల్ హీరో ఉత్తంకుమార్ నటించిన సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కించారు.

Advertisement

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా వాణిశ్రీ నటించింది. అంతేకాకుండా విలన్ గా కైకాల సత్యనారాయణ నటించాడు. అయితే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ తో పాటు సహనిర్మాతగా ఎస్ఆర్ స్వామి పని చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సముద్రం ఒడ్డు పై ఎన్టీఆర్ కైకాల మధ్య ఓ ఫైట్ సీన్ తెర‌కెక్కిస్తున్నారు. ఆ సమయంలో చిన్న షిప్ ట్రూలర్స్ పై సైడ్ ఆర్టిస్టులు వెళుతుండగా అనుకోకుండా ఎన్టీఆర్ ముఖానికి గట్టిగా ఓ రాడ్ తగిలింది. దాంతో రక్తం కారుతూనే ఉంది. షూటింగ్ లో అందరూ కంగారుపడ్డారు. వెంటనే ప్యాకప్ చెప్పి ఒడ్డుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఆ సమయంలో అక్కడ కనిపించిన ఆర‌బోసిన ఎండు మిరపకాయలను తీసుకుని నోట్లో వేసుకుని నమిలారు.

కాసేపయ్యాక పదండి షూటింగ్ చేద్దామని ఎన్టీఆర్ చెప్పారు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. తగిలిన దెబ్బను తట్టుకునేందుకు ఎన్టీఆర్ మిరపకాయలను తిన్నారు. షూటింగ్ కు అంతరాయం కలగకూడదని ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ చేసిన పని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అంతేకాకుండా ఆయన డెడికేష‌న్ కు ఫిదా అయ్యారు. అలాంటి డెడికేషన్ ఉంది కాబట్టే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడని ఇప్పటికీ ఆయనతో పని చేసిన వారు చెబుతుంటారు.

Visitors Are Also Reading