సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా ఆయనను దేవుడిగా కొలిచే ఎంతో మంది ప్రజలు ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్వయంకృషితో హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో ఓ మహోన్నత వ్యక్తిగా ఎదిగారు ఎన్టీఆర్ . సీనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పిన నటుడని అలనాటి ప్రముఖులు ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా అలనాటి ప్రజలు దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియకపోయినా రాముడు, కృష్ణుడు అనగానే ఎన్టీఆర్నే చూపిస్తారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తితే మొదటిగా ఎన్టీఆర్ పేరే గుర్తుకు వస్తుంది.
Advertisement
ఎన్టీఆర్ సినిమాల్లో నటిస్తున్న రోజుల్లో మిగతా వారికంటే చాలా ప్రత్యేకంగా ఉండేవారట. ఏ పని చేసిన సమయాన్ని కచ్చితంగా ఫాలో అయ్యేవారట. ఉదయం నిద్ర లేచిన దగ్గరనుంచి రాత్రి నిద్ర పోయే వరకు ఏ పనినైనా సరే టైం టు టైం చేసేవారట. ఒకపక్క సినిమాలు మరొక రాజకీయాల్లోతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆయన ఆహార విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించే వారిని కథలు కథలు గా చెప్పుకునేవారు. ఇంతకీ అప్పటిలో ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండేవో చూద్దాం..
Advertisement
ఆయన ఉదయం 4 గంటలకు నిద్రలేచి రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారట. ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ లో బాగా నెయ్యి వేసుకొని అరచేతి మందంలో ఉండే రెండు డజన్లు(24) ఇడ్లీలు తినేవారట. ఒక్కోసారి షూటింగ్స్ వేరే ప్రాంతంలో ఉండడం వల్ల బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీలు తినడం కుదరకపోతే భోజనం చేసేవారట. ఈ భోజనంలో కచ్చితంగా నాటుకోడి మాంసం ఉండేలా చూసుకునేవారట .
ప్రతి రోజు సాయంత్రం పూట 2 లీటర్ల బాదం పాలు తీసుకునేవారు. ఇక ఆయన చెన్నైలో ఉన్న సమయంలో బజ్జీలు తినడానికి బాగా ఇష్టపడేవారట ఎన్టీఆర్. ఈక్రమంలో ఆయన వేడి వేడి బజ్జీలు దాదాపు 40 వరకు తినేవారట. సినిమా అయినా వ్యక్తిగత జీవితం అయినా పక్కగా ఉంటేనే జీవితం సాఫీగా, సంతోషంగా కొనసాగుతుందని ఎన్టీఆర్ భావించేవారు. ఇప్పటికి కూడా ఆయన ఆహారపు అలవాట్లు గురించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన ఎంతో మంది వ్యక్తులు చర్చిస్తూనే ఉంటారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మరోచరిత్ర మూవీ చూసిన 20 మంది అలా చేశారా ?
Bigg Boss 7: బిగ్బాస్ సీజన్ 7కు యాంకర్ రష్మీ అంత డిమాండ్ చేసారా? రోజుకు ఎంతంటే?
హీరోల బిహేవియర్ వల్ల సినిమాలనే వదిలేసిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..?