బాలీవుడ్ సినిమాలు అంటే ఇంట్రెస్టింగ్ చూపే వారికి సీనియర్ నటీమణి, అందాబామ వహీదా రెహమాన్ తెలిసే ఉంటుంది. తన అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది ఈ నటి. ఈమె హైదరాబాద్‌లోని ఓ సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి జిల్లా మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వహించేవారు. దీంతో ఈమె విజయవాడలో చదువుకుని అక్కడే స్థిరపడ్డారు.
Advertisement
ఈమె తెలుగులో రోజులు మారాయి, బంగారు కలలు వంటి సినిమాల్లో నటించి తన ప్రతిభను కనబరిచారు. ఆమె కేవలం తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో నటించింది. పలు ఉత్తమ అవార్డులను కూడా అందుకుంది. ముఖ్యంగా 1966లో ఫిలింఫేర్ ఉత్తమ నటి గైడ్-2, 1968లో ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డు నీల్ కమల్ చిత్రానికి, 1967లో బెంగాలి జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డు, తీస్రీ కసమ్ చిత్రానికి ఉత్తమ నటి, 1971లో భార జాతీయ చలన చిత్ర పురస్కారంలో ఉత్తమ నటి అవార్డు రేష్మ ఔర్ షెరా చిత్రానికి, 1972లో పద్మ శ్రీ అవార్డు, 1994లో ఫిలిం ఫేర్ లైప్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2006లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2011లో పద్మభూషణ్, 2012లో ముంబయి ఫిలిం ఫెస్టివల్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2013లో సెంటినరీ అవార్డు ఇండియన్ ఫిలిం పెర్సానాలిటి వంటి అవార్డులను అదుకున్నారు.
Advertisement
ప్రస్తుతం వహిదా రెహమాన్ వయస్సు 84 సంవత్సరాలు. ఈమె లేటు వయసులో వహీదా రెహమాన్ తన ముచ్చట తీర్చుకున్నారు. ఆమె తాజాగా బీఎండబ్ల్యూ5 సిరీస్ ఫేస్ లిప్ట్ కారును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ సెలూన్ కారును బీఎండబ్ల్యూ ప్రతినిధులు వహీదా రెహమాన్ కు అందించారు. అటు విలాసం ఇటు పనితనం ఏవిధంగా చూసినా బీఎండబ్ల్యూ కార్ల ప్రత్యేకత కనిపిస్తుంది. వహీదా కొనుగోలు చేసిన 5 సిరీస్ కారు ఎక్స్ షోరూం ధర రూ.64.50 లక్షల నుంచి రూ.74.50 లక్షల వరకు ఉంటుంది. ఇప్పటివరకు వహిదా హోండా అక్కార్డ్ కారును వినియోగించారు.
Also Read :
ఆ షో రికార్డింగ్ మధ్యలోనే వదిలేసిన మెగాస్టార్.. అసలు ఏమి జరిగిందంటే..?
రామ్‌చరణ్ దంపతులు పదవ పెళ్లి రోజు వేడుకలను ఎక్కడ జరుపుకుంటున్నారో తెలుసా..?