Home » ఆ షో రికార్డింగ్ మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన మెగాస్టార్‌.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

ఆ షో రికార్డింగ్ మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన మెగాస్టార్‌.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

by Anji
Ad

ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం విధిత‌మే. ఆచార్య సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు చిరు. తాజాగా చిరంజీవి గురించి ఓ వార్త ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆచార్య సినిమాలో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన విష‌యం తెలిసిందే. సినిమా ప్రారంభించక ముందు అనుకున్న క‌థ కాకుండా సినిమా ప్రారంభించిన త‌రువాత క‌థ మార్చార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Advertisement

అయితే ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. కానీ ఆమె న‌టించిన అన్ని సీన్స్ క‌ట్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న పూజాహెగ్దే న‌టించింది. తొలిసారి చిరు-చ‌ర‌ణ్ క‌లిసి చేసిన పూర్తి స్థాయి సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ వారి అంచ‌నాలను అందుకోవ‌డంలో సినిమా విఫ‌ల‌మైంది. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న రావ‌డంతో చిరంజీవి తాను ముందే ప్లాన్ చేసుకున్న వెకేష‌న్‌కు వెళ్లిపోయారు. ఆయ‌న త‌న భార్య సురేఖ‌తో క‌లిసి దాదాపు నెల రోజుల పాటు విదేశాల్లోనే గ‌డిపారు. ఈ మ‌ధ్య ఆయ‌న తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు. త్వ‌ర‌లో మ‌రో సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నారు చిరంజీవి. చిరంజీవి న‌టిస్తున్న భోళా శంక‌ర్ సినిమా షూటింగ్ జూన్ 21 నుంచి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది.

Advertisement

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక షోకి చీఫ్ గెస్ట్‌గా వెళ్లార‌ని తెలుస్తోంది. షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో షోకి యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న వ్య‌క్తి షో స్పాన్స‌ర్ విష‌యంలో ఓ పేరు త‌ప్పుగా ప‌లికార‌ని.. మెగాస్టార్ చిరంజీవిని మ‌రొక సారి రీటేక్ చేయ‌మ‌ని కోరార‌ట‌. ఈ విష‌యంలో చిరంజీవి కాస్త హ‌ర్ట్ అయిన చిరు వెంట‌నే షో నుంచి వాకౌట్ చేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆ షో ఏమిట‌నేది ఇంకా క్లారిటీ లేదు. ఆ షో గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. అధికారికంగా ఈ విష‌యం బయ‌టికి రాలేదు. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుల సినిమాలు చేస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ దర్శ‌క‌త్వంలో భోళాశంకర్‌, మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఫాద‌ర్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వీర‌య్య సినిమాలు చేస్తున్నారు.

Also Read : 

రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు ప‌ద‌వ పెళ్లి రోజు వేడుక‌ల‌ను ఎక్క‌డ జ‌రుపుకుంటున్నారో తెలుసా..?

యూట్యూబ్ లో అత్యధిక వ్యూవ్స్ సంపాదించిన టాప్ 5 తెలుగు సినిమా టీజర్ల లిస్ట్…నంబర్ 1 స్థానంలో ఏ సినిమా టీజర్ అంటే…!

 

Visitors Are Also Reading