భారత మాజీ స్టార్ క్రికెటర్లు మూవీ క్రిటిక్స్ గా మారారు. ఆటలో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే వారు ఆటవిడుపుగా మూవీ గురించి వారు రివ్యూ ఇచ్చారు. ఇండియన్ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా గురించి అందరికీ తెలిసిందే. వారు క్రీజులో ఉంటే పరుగులు వరదలా పారాల్సిందే. సెహ్వాగ్ ఓపెనింగ్ బ్యాటింగ్‌తో అదరగొట్టి ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్ లాల్‌సింగ్ చడ్డా సినిమాను సెహ్వాగ్, రైనా చూశారు. వారు చూసి అంతటితో ఊరుకోలేదు. ఈ చిత్రానికి రివ్యూ కూడా ఇచ్చారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కరీనా కపూర్ అమీర్ ఖాన్ కు జోడిగా నటించింది. అమీర్‌ఖాన్ నటన, ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే గురించి వారు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఈ సినిమా కామన్ ఇండియన్ ఎమోషన్స్ ను కంప్లీట్ గా క్యాప్చర్ చేసిందన్నారు. దేశంలోని మధ్య తరగతి ప్రజల భావోద్వేగాలను అద్భుతంగా చూపించారని పేర్కొన్నారు.
Advertisement
ఇది అమీర్ ఖాన్ సినిమా కాబట్టి నటన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు వీరేంద్ర సెహ్వాగ్. ఈ చిత్రంలో ఇతర పాత్రల గురించి కూడా మాట్లాడారు. అమీర్‌ఖాన్‌తో పాటు ప్రతీ ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. ప్రతీ టెక్నీషియన్ మనసు పెట్టి పని చేశారని ప్రశంసించారు. సెంటిమెంట్‌ను ప్రతిధ్వనిస్తూ.. లాల్‌సింగ్ చడ్డా బృందం చేసిన కృషి ప్రయత్నాల పట్ల తాను పూర్తిగా విస్మయం చెందుతున్నానని రైనా చెప్పుకొచ్చాడు. ఇక అన్నింటికి మించి ఈ సినిమాలో గొప్పదనం ఉందని రైనా పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రేమ కథతో పాటు అందమైన పాటలు అంటూ రైనా అభిప్రాయ పడ్డారు. ఈ సినిమాలో లవ్ ట్రాక్‌తో పాటు అద్భుతమైన పాటలను సురేష్ రైనా ఎంజాయ్ చేశారట.
స్టార్ క్రికెటర్లు ఇద్దరూ రివ్యూ చెబుతున్న వీడియోను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ ఇన్‌స్టాగ్రామ్‌లో సేర్ చేసింది. లాల్‌సింగ్ చడ్డా చూసిన తరువాత వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా స్పందన అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంతోనే ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ హిందీ రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్ మరియు వయాకామ్ 18 సంయుక్తంగా నిర్మించారు.
Also Read :
MACHERLA NIYOJAKAVARGAM MOVIE REVIEW : నితిన్ “మాచర్ల నియోజకవర్గం” సినిమా రివ్యూ..!
నాగార్జున ని మొదటి సారి చూడగానే ఇష్టపడ్డాను..! నాగ్ నా దగ్గరికి వచ్చి ఏంచేశారంటే ?