Home » MACHERLA NIYOJAKAVARGAM MOVIE REVIEW : నితిన్ “మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం” సినిమా రివ్యూ..!

MACHERLA NIYOJAKAVARGAM MOVIE REVIEW : నితిన్ “మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం” సినిమా రివ్యూ..!

by AJAY
Ad

ప‌రిచ‌యం :

జ‌యం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన నితిన్ మొద‌టి సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర‌వాత పలు సూప‌ర్ హిట్ చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే నితిన్ కెరీర్ లో సూపర్ హిట్స్ ఉన్నా కూడా అవ‌న్నీ ప్రేమ క‌థ‌లే. అప్పుడప్పుడూ మాస్ క‌థ‌ల‌తో వ‌చ్చినా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. కాగా తాజాగా నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌ర్గంతో మ‌రోసారి మాస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ సినిమా నితిన్ కు హిట్ ఇచ్చిందా లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా నితిన్ కు జోడీగా కేథ‌రిన్ మ‌రియు కృతి శెట్టి హీరోయిన్ లుగా న‌టించారు. ఈ చిత్రానికి మ‌హతి స్వ‌ర సాగ‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

Advertisement

క‌థ& క‌థ‌నం:

సినిమాలోకి వెళితే నితిన్ ఈ చిత్రంలో క‌లెక్ట‌ర్ పాత్ర‌లో న‌టించాడు. పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో నితిన్ అక్ర‌మాల‌కు పాల్ప‌డే రాజ‌కీయ‌నాయ‌కుల భ‌ర‌తం ప‌ట్టేందుకు క‌లెక్ట‌ర్ గా ఎంట్రీ ఇస్తాడు. నితిన్ క‌లెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న ఓ జిల్లాలోని నియోజ‌క‌వ‌ర్గంలో కొన్నేళ్ళ పాటూ ఎల‌క్ష‌న్స్ అన్న మాట ఉండ‌దు. కానీ నితిన్ ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత త‌న దైన స్టైల్ లో ఎల‌క్ష‌న్ లు జ‌రిపేంచేలా నిర్ణ‌యం తీసుకుంటాడు. ఈ క్ర‌మంలో విల‌న్ లతో నితిన్ కు ఎలాంటి గొడ‌వ‌లు జ‌రుగుతాయి.

Advertisement

అస‌లు ఎల‌క్ష‌న్స్ ను జ‌రిపించ‌గ‌లుగుతాడా ఈ క్ర‌మంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటాడు. హీరోయిన్ కృతి శెట్టితో ఎలా ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది..? కేథ‌రిన్ తో ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది ఈ సినిమా క‌థ‌. కాగా సినిమాలో నితిన్ మాస్ హీరోగా క‌నిపించాడు.

క‌థ ఎంచుకున్న నేప‌థ్యంలో పాత‌దే అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు త‌న‌దైన రీతిలో క‌థ‌ను రాసుకున్నాడు. దాంతో పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన సినిమా అయిన‌ప్ప‌టికీ కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ ల పాత్ర‌లు వారి ప‌ర్ఫామెన్స్ కూడా ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ముందు నుండి అనుకున్న‌ట్టుగానే అంజ‌లి త‌న పాట‌తో థియేట‌ర్ ను షేక్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప‌ర‌వాలేదు అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం సాగ‌దీసిన‌ట్టు అనిపిస్తుంది. కానీ మొత్తానికి నితిన్ మాచ‌ర్ల నియోజ‌క‌ర్గాన్ని థియేట‌ర్ లో చూడ‌వ‌చ్చు.

Visitors Are Also Reading