Home » రోహిత్ అలా పరుగులు చేస్తే వేస్ట్..!

రోహిత్ అలా పరుగులు చేస్తే వేస్ట్..!

by Azhar
Ad

భారత జట్టు ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం.. ఇప్పటికే అక్కడికి చేసుకొని సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు ఆడుతున్న రోహిత్ సేన ఈ నెల 23న దాయాధి పాకిస్థాన్ తో తమ మొదటి మ్యాచ్ అనేది ఆడనుంది. ఈ క్రమంలో ఇండియా బ్యాటింగ్ పై మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ అనేవి చేసాడు.

Advertisement

అయితే సెహ్వాగ్ ఆటతీరు గురించి అందరికి తెలిసిందే. టెస్ట్, వన్డే, టీ20 అనే తేడా లేకుండా అన్ని మ్యాచ్ లలో బాదడమే సెహ్వాగ్ లక్ష్యం. అటువంటి సెహ్వాగ్ మాట్లాడుతూ,.. టీ20 క్రికెట్ లో ఎప్పుడు యావరేజ్ ను లెక్కలోకి తీసుకోకుండదు. ఈ పొట్టి ఫార్మాట్ లో కేవలం స్ట్రైక్ రేట్ మాత్రమే చూడాలి అని చెప్పాడు.

Advertisement

కెప్టెన్ రోహిత్ శర్మ వంటి ఆటగాడు 100 స్ట్రైక్ రేట్ తో ఎన్ని పరుగులు చేసిన అవి వేస్ట్.. ఓపెనర్ అయిన రోహిత్ ఎన్ని పరుగులు చేసిన కూడా.. 200 లకు పైగా స్ట్రైక్ రేట్ అనేది మెంతెన్ చేస్తేనే ఆ పరుగులు జట్టుకు ఉపయోగపడుతాయి. ఇక ప్రస్తుతం ఈ పద్దతిలోనే సూర్య కుమార్ యాదవ్ ఆడుతున్నాడు అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అలాగే ఈ ప్రపంచ కప్ లో సూర్య కుమార్ భారత బ్యాటింగ్ లైనప్ లో కీలకం అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ఇండియా, పాక్ మ్యాచ్ లో వారిదే విజయం..!

ప్రపంచ కప్ కు ముందు ఆసీస్ కెప్టెన్ కు ఐసీసీ వార్నింగ్..!

Visitors Are Also Reading