Home » MAHESH BABU : సర్కారు వారి పాట స్టొరీ లీక్….ఇదే నిజమైతే ఈ సినిమా కూడా…!

MAHESH BABU : సర్కారు వారి పాట స్టొరీ లీక్….ఇదే నిజమైతే ఈ సినిమా కూడా…!

by AJAY
Ad

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట‌ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 14రీల్స్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పరశురాం గతంలో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు.

అయితే ఇవి రెండు ప్రేమ కథ చిత్రాలు కానీ మహేష్ బాబు తో మాత్రం యాక్షన్ ఎంటర్ టైనర్ ను పరశురాం తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమా ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మ‌రోవైపు ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లు మ‌రియు పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుంటున్నాయి. అయితే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ స్టోరీ లైన్ చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

Advertisement

ఆ స్టోరీ ఏంటంటే….సినిమాలో మహేష్ బాబు అజయ్ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా ఒక ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా మహేష్ బాబు కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే అప్పటి వరకు నగరంలో ఉద్యోగం చేసిన మహేష్ బాబు తన లక్ష్యాన్ని మార్చుకొని స్వగ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఓ పెద్ద సమస్య ఏదుర‌వుతుంది.

దానిని పరిష్కరించడమే ఈ సినిమా కథగా టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు ఇది రొటీన్ కథ అని ఇదే గనక సర్కారు వారి పాట నిజ‌మైన‌ స్టోరీ అయితే ఈ సినిమా హిట్ అవడం క‌ష్ట‌మే అని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి చద‌వండి :

Sonu Sood : నేను భార్య బాధితుడిని.. ద‌య‌చేసి సాయం చేయండి

కృష్ణ వ‌దిలేసిన ఈ సినిమా చిరంజీవికి లైఫ్ ఇచ్చింది!?

Visitors Are Also Reading