Telugu News » Blog » Sonu Sood : నేను భార్య బాధితుడిని.. ద‌య‌చేసి సాయం చేయండి

Sonu Sood : నేను భార్య బాధితుడిని.. ద‌య‌చేసి సాయం చేయండి

by Anji
Ads

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ కరోనా వైర‌స్‌.. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కార్మికులు, కూలీల‌కు సాయం అందించిన విష‌యం తెలిసిన‌దే. కొవిడ్ కార‌ణంగా సీరియ‌స్‌గా ఉన్న పేషెంట్ల‌కు వైద్య స‌దుపాయాలు అందించి ప‌లువురి ప్రాణాల‌ను కాపాడారు. సీరియ‌స్‌గా ఉన్న పేషెంట్ల‌కు వైద్య స‌దుపాయాలు అందించి ప‌లువురి ప్రాణాల‌ను కాపాడారు. అప్ప‌టినుంచి ఆయ‌న త‌న సేవా కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు.. సోష‌ల్ మీడియా వేదిక‌గాను ఎంతో మందికి స‌హాయం అందిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన‌, లేదా స‌ర్జరీలు వంటి కోసం ఆర్థిక సాయం కావాలంటూ సోనూసూద్‌కు ట్వీట్ చేస్తుంటారు.

Advertisement


ఇలాంటివి త‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే స్పందించి వారికి సాయం అందిస్తున్నారు. ఈ త‌రుణంలో ఓ బాలుడికి సోనూ ఫౌండేష‌న్ ద్వారా ఇటీవ‌ల హార్ట్ స‌ర్జ‌రీకి చేయించారు సోనూసూద్‌. ప్ర‌స్తుతం ఆ బాలుడు కోలుకుంటున్నాడు. ఇదే విష‌యాన్ని సోనూకు తెలియ‌జేస్తూ ఆ బాలుడి కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌కు ట్వీట‌ర్ ద్వారా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇది చూసిన ఓ నెటిజ‌న్ సోనూకు ఫ‌న్నీ ట్వీట్ చేశాడు. తాను భార్య‌బాధితుడినని.. త‌న‌కు కూడా చికిత్స చేయించాలంటూ సోనూసూద్‌ను చేరాడు. దీంతో ఈ ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Advertisement

సోద‌రుడు అయిన సోనూసూద్ మీరు అంద‌రికీ చికిత్స అందేలా చేస్తున్నారు. నా భార్య రోజూ నా ర‌క్తం తాగుతోంది. దానికి ఏదైనా చికిత్స ఉందా..? ఉంటే ద‌య‌చేసి సాయం చేయండి. ఒక భార్య బాధితుడిగా చేతులు జోడించి మిమ్మ‌ల్ని సాయం అడుగుతున్నానని ట్వీట్ చేశాడు. దీనికి సోనూసూద్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. అది ప్ర‌తీ భార్య జ‌న్మ‌హ‌క్కు బ్ర‌ద‌ర్‌. ఆ ర‌క్తంతో నాలాగే మీరు కూడా బ్ల‌డ్ బ్యాంకు ప్రారంభించండి అంటూ న‌వ్వుతున్న ఎమోజీని జ‌త చేశారు.

Advertisement

ఇవి చద‌వండి :

  1. Health tips Telugu: అధిక డీహైడ్రేషనా.. అయితే ఇవి తినాల్సిందే..!!
  2. Viral Video : పెళ్లిలో వ‌ధువు అరాచ‌కం.. వ‌రుడికి పీట‌ల మీదే వేలు చూపిస్తూ.. ఏమి చేసిందంటే..?
  3. అమ్మ-నాన్న చ‌దువులు, వైద్య‌వృత్తిలో ఉండ‌గా.. అమ్మ‌మ్మ త‌న‌ను పెంచిందంటోన్న ప్రియాంక చోప్రా