Home » శృతిహాసన్ తల్లికి ఏంటి ఈ కష్టాలు..డబ్బుల్లేక చివరికి స్టేజ్ షోలలో…!

శృతిహాసన్ తల్లికి ఏంటి ఈ కష్టాలు..డబ్బుల్లేక చివరికి స్టేజ్ షోలలో…!

by AJAY

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు స్టార్ట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి. స్టార్ స్టేటస్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకాల వేసుకోవాలి. సినిమాల్లో అవకాశాలు ఉన్నప్పుడు లగ్జరీ జీవితం గడిపి ఆ తర్వాత అవకాశాలు లేక దుర్భరమైన జీవితాన్ని గడిపిన స్టార్లు కూడా ఎందరో ఉన్నారు. అలా జీవితాన్ని గడపలేక కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరు కష్టాలకు ఎదురీది జీవనాన్ని గడుపుతుంటారు.

ఈ పరిస్థితి కేవలం చిన్న పాత్రలు చేసేవాళ్లకే కాదు ఒకప్పటి స్టార్ హీరోలు హీరోయిన్లకు కూడా తప్పలేదు. అంతెందుకు ఇండియాలోనే స్టార్ హీరో, విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య సారిక హాసన్ కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని తాజాగా సారిక హాసన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన భర్త కమల్ హాసన్ తో విడాకులు తీసుకున్న తర్వాత చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని సారిక హాసన్ చెప్పారు.

విడాకుల తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అయితే తాను అనుకున్న దానికంటే ఎక్కువగా ఏకంగా పది ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో ఆ సమయంలో స్టేజ్ షోలలో కూడా నటించానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ తనను తాను మలుచుకుని సినిమాలవైపు వచ్చినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా సారిక హాసన్ ముఖ్యమైన పాత్రలో అమెజాన్ ప్రైమ్ ఓ వెబ్ సిరీస్ ను నిర్మించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

 

దాంతో శృతి హాసన్ తల్లి ఇన్ని కష్టాలు పడిందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా ఇండియాలోనే స్టార్ హీరో కమల్ హాసన్ భార్య ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అంటే దారుణం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు అందుకే స్టార్ స్టేటస్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనక్కి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా సారిక హాసన్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని సినిమాల్లో నటించడం గొప్ప విషయం.

Also read :

సర్కారువారిపాటలో భారీ మిస్టేక్…ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ…

భార్యలు భర్తలను ఎందుకు పేరు పెట్టి పిలవకూడదు… అలా పిలిస్తే ఏం జరుగుతుంది…!

Visitors Are Also Reading