మనదేశంలో కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటిస్తే ఏం జరుగుతుంది…? అసలు ఎందుకు పాటించాలి అనే అనుమానాలు కూడా చాలా మందికి ఉంటాయి. ఈకాలంలోని పెద్దవాళ్లను అడిగితే పాటించాలి అంటే పాటించాలి ఎందుకని అడక్కూడదు అంటారు. ఇక అలాంటి ప్రశ్ననే భర్తలను భార్యలు పేరు పెట్టి పిలవకూడదని చెప్పడం.
ఈ కాలంలో కొంతమంది తమ భర్తలను పేర్లు పెట్టి పిలవడం చూస్తూనే ఉన్నాం….కొంతమంది ముద్దుగా బంగారం, బుజ్జి, కన్నా అని కూడా పిలుచుకుంటారు. ఇక మరికొందరయితే ఏకంగా ఒరేయ్..రారా అని పిలుచుకునేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఒకప్పుడు అంతెందుకు మన తల్లులు ఎప్పుడైనా తండ్రిని పేరు పెట్టి పిలవడం చూశామా..? ఏవండీ…ఓయ్….నిన్నే ఇలా పిలుస్తుంటారు.
అయితే అలా పిలవడం వెనక ఓ కారణం ఉందట. మన పురాణాలలో ఇతిహాసాలలో భార్యలు తమ భర్తలను ఎక్కడా పేర్లు పెట్టిపిలవరు.రామాయణంలో సీతాదేవి రాముడిని ఏకాంతంలో ఉన్నప్పుడు తప్ప మరెప్పుడూ పేరు పెట్టి పిలవదు. ఇక మనమంతా మన పవిత్రగ్రంథాలనే నమ్ముతాము. కాబట్టి పూర్వకాలం నుండి భార్యలు భర్తలను పేర్లు పెట్టి పిలవకూడదు అనేది ఆచారం గా మారిపోయింది. అలా పిలవడం వల్ల భర్తకు ఇతరుల ముందు అవమానం అని కూడా భావించేవారట.
కానీ ఇప్పుడు అలా చెబితే చివాట్లు తప్పవు. కాబట్టి ఆచారాలను పాటించేవారు మాత్రం భర్తలను పేరు పెట్టి పిలవకూడదు. అంతే కాకుండా ముఖ్యంగా భర్త తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ముందు మాత్రం భర్తలను అస్సలు పేరు పెట్టి పిలవకూడదు. ఒకవేళ ఏవండీ అని పిలవడం ఇబ్బందిగా ఉంటే ఏదైనా వరుస పెట్టి పిలవడం మంచిదట. బావ, మామయ్య ఇలా పిలవడంలో ప్రేమతో పాటూ వినడానికి కూడా భర్తలు ఇష్టపడతారట.
Also read :
తిరుమలలో మనకి నిత్యం వినిపించే ‘ఓం నమో వేంకటేశాయ’ ఆ గొంతు ఎవరిదో తెలుసా..?
ఈ 6 సినిమాల్లో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ వేరే లెవల్..చూస్తే కన్నీళ్లు ఆగవు…!