Home » స్పోర్ట్స్ ద్వారా సానియా మీర్జా ఎంత సంపాదించిందో తెలుసా…!

స్పోర్ట్స్ ద్వారా సానియా మీర్జా ఎంత సంపాదించిందో తెలుసా…!

by AJAY
Ad

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సానియా మీర్జా రీసెంట్ తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ లో మొదటి రౌండ్ లో ఓడిపోయింది. అనంతరం సానియా మీర్జా తాను ఆటకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా కొన్ని రోజులుగా తను మోకాలు, మోచేయి నొప్పి తో బాధపడుతున్నట్లు తెలిపింది. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ ఓటమికి ఇవే కారణాలు అని చెప్పడం లేదని తెలిపింది.

Advertisement

అలా అని కెరీర్ ను కూడా పొడిగించలేను అని తెలిపింది.తన వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు అని ఈ సీజన్ ను విజయవంతంగా ముగించడమే తన ముందున్న లక్ష్యం అని పేర్కొంది. ఇదిలా ఉంటే భారత్ తరపున ఆడి దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచిన సానియా మీర్జా తన ఆట ద్వారా ఎంత సంపాదించుకుంది అని నెటిజన్లు వెతకడం ప్రారంభించారు.

Advertisement

అయితే సానియా మీర్జా 2003లో ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ గా కెరీర్ మొదలు పెట్టింది. మూడుసార్లు మహిళల డబుల్స్ టైటిల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పటివరకు స్పోర్ట్స్ ద్వారా సానియా మీర్జా 53 కోట్లు గెలుచుకున్నట్టు తెలుస్తోంది. 2012లో సానియా మీర్జా హైదరాబాద్ లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది.

ప్రస్తుతం సానియా మీర్జా ఈ ఇంట్లోనే నివసిస్తోంది. ఇక ఇప్పుడు ఆ ఇంటి విలువ దాదాపు పదమూడు కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దుబాయ్ లోనూ సానియా మీర్జాకు ఓ విలాసవంతమైన బంగ్లా ఉంది. టెన్నిస్ ద్వారా సానియా మీర్జా సంవత్సరానికి దాదాపుగా మూడు కోట్ల వరకు సంపాదించినట్టు సమాచారం. అంతేకాకుండా వాణిజ్య ప్రకటనల ద్వారా సంవత్సరానికి 25 కోట్ల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇక సానియామీర్జా ఇప్పటి వరకు మొత్తం స్పోర్ట్స్ ద్వారా 184 కోట్లు సంపాదించినట్టు సమాచారం.

Visitors Are Also Reading