టాలీవుడ్ లో ప్రస్తుతం గోల్డెన్ బ్యూటీగా కొనసాగుతుంది హీరోయిన్ సంయుక్త మీనన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజీ సంపాదించుకుంది ఈ బ్యూటీ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత బింబిసారా, సార్ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే సంయుక్త కు కోపం కూడా చాలా ఎక్కువనే అట. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. టాలీవుడ్ హీరోయిన్ సమంతకు వీరాభిమానినని కూడా తెలిపింది. సమంతలాగే ఉంటానని చాలామంది అంటారని, ఆమెలా నటిస్తున్నానని చెబుతుంటే ఇంకా సంతోషంగా ఉందని వెల్లడించింది సంయుక్త.
Advertisement
తమిళంలో హీరో ధనుష్ నటన అంటే చాలా నచ్చుతుందని.. తాను పదో తరగతిలో ఉన్నప్పుడు ధనుష్ నటించిన ఆడుగలం సినిమాలోని పాటలను బస్సులో చూసి డ్యాన్స్ చేసేదానినని చెప్పింది. అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని అస్సలు ఊహించలేదని.. తన నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో నటించాలని ఉందని తెలిపింది. తాను ఒక వ్యక్తి నడిరోడ్డుపై కొట్టిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి తన తల్లితో కలిసి బయటకు వెళ్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ ఆ పొగను తమపై వదిలాడని.. దీంతో కోపంగా అతని చెంప పగలగొట్టానని తెలిపింది.
Advertisement
ప్రయాణం చేయడం ఒంటరిగా ఉండడం చాలా ఇష్టమని ఎక్కువగా హిమాలయాలకు వెళ్తుంటానని.. ఖాళీ సమయంలో కవితలు రాస్తుంటానని చెప్పుకొచ్చింది. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేశానని సంయుక్త తెలిపింది. ప్రస్తుతం సంయుక్త నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో మరోసారి కళ్యాణ్ రామ్ తో జోడి కడుతుంది. ఇదే కాకుండా దర్శకుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సంయుక్తాలు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
మరి కొన్ని ముఖ్య వార్తలు :
ఐపీఎల్ హిస్టరీలోనే భారీ రికార్డు.. 236 స్ట్రైక్ రేట్ తో 229పరుగులు !
త్రిష టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి అసలు కారణం ఇదేనా..?
శోభన్ బాబు మరదలిని చేసుకోవాల్సిన కృష్ణ.. కానీ అడ్డుపడింది ఎవరంటే..!!