గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని హీరో నాగ చైతన్య వివాహం చేసుకొని విడిపోయిన తర్వాత సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం విషయాలు బయటకు వస్తూ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారు ఎందుకు విడిపోయారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.. దీంతో అనేక వార్తలు చలువలు పలువలుగా పుట్టుకొస్తున్నాయి. అయితే, తాజాగా విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేసింది సమంత.
read also : RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?
Advertisement
వివాహ బంధంలో ఎంత నిజాయితీగా ఉన్నా వర్కౌట్ కాలేదని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివాహ జీవితంలో తాను ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ, తనపై అనవసరంగా నిందలు వేశారని సమంత పేర్కొంది. విడాకులు తీసుకున్న కొంత కాలానికి పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందని, ఖాళీగా ఉండలేక దానికి ఓకే చెప్పానని తెలిపింది.
Advertisement
read also : TS Constable : ఏప్రిల్ 2న పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి
అయితే ఈ టైంలో ఐటెమ్ సాంగ్స్ కరెక్ట్ కాదని ఇంట్లో వాళ్ళు వారించిన, తాను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఇంట్లో బాధపడుతూ కూర్చోవాలనే ఆ సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది. సామ్ వ్యక్తిగత జీవితంపై కూడా సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను పడిన ప్రతీసారి బలంగా నిలబడ్డానని, నన్ను వేలెత్తి చూపిస్తే గెలిచినట్టు కాదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నా తప్పు లేనప్పటికీ తనను చాలామంది జడ్జ్ చేశారని, అయినప్పటికీ తాను ఎప్పుడూ నిజాయితీగానే ఉంటూ ఎవరికి భయపడలేదని తెలిపింది సామ్. ఈ రెండేళ్ల జీవితం తనకు ఎంతో నేర్పిందని, ఇప్పుడు శారీరకంగా, మానసికంగా మరింత బలంగా ఉన్నానంది సమంత.
also read:ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..?