Home » య‌శోద సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

య‌శోద సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ న‌టీ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. స‌మంత ముఖ్యంగా నాగ‌చైత‌న్యతో విడాకులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి సినిమాల విష‌యంలో మరింత దూకుడు పెంచింది. ఒక‌దాని త‌రువాత మ‌రోటి పాన్ ఇండియా సినిమాతో పుల్ బిజీగా ఉంది. తెలుగులో ఏమాయ చేశావే సినిమాతో ప‌రిచ‌య‌మై కుర్ర‌కారుని త‌న‌దైన మాయ‌లో ప‌డేసింది ఈ బ్యూటీ. ముఖ్యంగా స‌మంత క‌థల విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ కెరీర్ ప‌రంగా దూసుకెళ్తొంది. ఈ మ‌ధ్య ఎక్కువ‌గా లేడీ ఓరియంటెడ్ సినిమాల‌ను చేయ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తోంది. ఓ బేబీ, యూట‌ర్న్ వంటి సినిమాలు ఆ కోవకు చెందిన‌వే.

Advertisement

తాజాగా య‌శోద సినిమాలో కూడా న‌టిస్తోంది. లేడీ ఓరియంటేడ్ సినిమాల్లో న‌టిస్తూ ఆమె స‌త్తా చాటుతోంది. క‌మ‌ర్షియ‌ల్ తో పాటు కంటెంట్ ఉన్న క‌థ‌లకు ఓకే చెబుతున్నారు. అలాంటి సినిమాలో ఒక‌టి య‌శోద‌. ఈమూవీలో స‌మంత య‌శోద పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ జాన‌ర్ క‌థ‌గా ఈ మూవీని హ‌రి-హ‌రీష్ ద్వ‌యం తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ‌దేవి మూవీస్ బ్యాన‌ర్ పై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ దీనిని ఎంతో గ్రాండ్ లెవ‌ల్‌లో నిర్మించారు. సినిమా కోసం య‌శోద తీసుకున్న రెమ్యున‌రేష‌న్ కి సంబంధించిన వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

Advertisement


గ‌త కొంత కాలంగా స‌మంత చ‌ర్మ సంబంధిత స‌మస్య‌తో బాధ‌ప‌డుతోంద‌ని మ‌రికొంద‌రూ ఆమె గ‌ర్భ సంచి తీయించుకుంద‌ని ఇలా ఏవో వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. స‌మంత సినిమా కోసం కేవ‌లం 50 రోజుల‌కు కాల్సీట్స్ మాత్ర‌మే ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇలా అతి త‌క్కువ కాల్షిట్స్ తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ మాత్రం భారీగా తీసుకుంద‌ని తెలుస్తోంది. స‌మంత య‌శోద సినిమా కోసం దాదాపు 2.75 కోట్ల రెమ్యూన‌రేషన్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. సినిమాకి గాను స‌మంత ఎక్కువ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ అందుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. యదార్థ ఘ‌ట‌న ఆధారంగా క్రైమ్‌, థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుద‌ల తేదీ ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఇటీవ‌లే స‌మంత య‌శోద టీజ‌ర్ విడుద‌ల అయింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీలో ఏక‌కాలంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Pushpa 2 : పుష్ప‌ 2లో సాయిప‌ల్ల‌వి రోల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌లు

Visitors Are Also Reading