Home » Pushpa 2 : పుష్ప‌ 2లో సాయిప‌ల్ల‌వి రోల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌లు

Pushpa 2 : పుష్ప‌ 2లో సాయిప‌ల్ల‌వి రోల్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత‌లు

by Anji
Ad

అల్లు అర్జున్ సుకుమార్ ఇద్ద‌రూ కలిసి పుష్ప సినిమాకి కొన‌సాగింపు ప‌నిలో ప‌డ్డారు. గ‌త కొద్ది రోజులుగా ఈ సినిమాపై న‌డుస్తున్న రూమ‌ర్స్ పై చిన్న క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్‌. పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఎల్ల‌లు దాటింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో బ‌న్నీ మార్క్ క‌నిపించింది. పుష్ప‌రాజ్ గా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి పిచ్చెక్కిపోయారు ఆడియెన్స్‌. ఇక ఈ సినిమా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన‌ సినిమాలో క్రేజీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

శ్రీ‌వ‌ల్లిగా ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇప్పుడు అల్లుఅర్జున్ సుకుమార్ ఇద్ద‌రూ క‌లిసి పుష్ప సినిమాకి కొన‌సాగింపు ప‌నిలో ప‌డ్డారు. ప్ర‌స్తుతం పుష్ప 2 ప‌నుల్లో బిజీగా ఉన్న సుకుమార్ ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్, అవుట్ పుట్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గేదేలే అని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ మొత్తానికి చెప్పేశార‌ట‌. ఈ మేర‌కు కొన్ని కండీష‌న్లు పెట్టి చాలా స్ట్రిక్ట్ గా సినిమా ప‌నులు చేస్తున్నార‌ట‌. అదేవిధంగా సినిమాలో పుష్పలో న‌టించిన న‌టీన‌టుల‌తో పాటు మ‌రికొంత మంది కొత్త న‌టులు ఉండ‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో ఇప్ప‌టికే మంచి క్రేజ్ సంపాదించుకున్న‌ సాయిప‌ల్ల‌విని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయ‌బోతున్నట్టు స‌మాచారం. పుష్ప 2 లో సాయిప‌ల్ల‌వి కోసం సుకుమార్ డిజైన్ చేసిన పాత్ర అద్భుతంగా ఉండ‌నుంద‌ని.. అడ‌వుల్లో క‌నిపించే గిరిజ‌న యువ‌తి రోల్ లో సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌నుంద‌ని అన్నారు.

Advertisement

ఇది కూడా చ‌దవండి :  సినిమాల్లో నటించి నా పరువు తీయకు అని మమ్ముట్టి ఎందుకు హెచ్చరించారు ? దుల్కర్ భార్య ఎవరో తెలుసా ?

సినిమాలో పుష్ప‌రాజ్‌తో సాయిప‌ల్ల‌వి ల‌వ్ ట్రాక్ కూడా ఉంటుంద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా దీనిపై మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని, అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే అని మేక‌ర్స్ చెప్పారు. అయితే పుష్ప‌2లో అన‌సూయ రోల్ మ‌రింత పవ‌ర్‌పుల్ గా ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. అన‌సూయ రేంజ్ పెంచేవిధంగా ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని చెప్పుకుంటున్నారు. పుష్ప‌లో దాక్షాయ‌ణి పాత్ర‌లో అన‌సూయ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగంలో ఊ అంటావా మామ‌, ఉ ఊ అంటావా మామ అంటూ స‌మంత‌తో ఇండియాను షేక్ చూపించిన సుక్కు.. ఈ రెండో భాగంలో కూడా అదే కిక్ ఉండాల‌ని బ‌లంగా ఫిక్స్ అయ్యార‌ట‌. స్పెష‌ల్ సాంగ్ కోసం మ‌రోస్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించ‌బోతున్నార‌ట‌. ఏదేమైనా ఫ‌స్ట్ పార్ట్ ని మించి సెకండ్ పార్ట్ ఉండాల‌ని సుకుమార్ బలంగా ఫిక్స్ అయ్యార‌ట‌.

ఇది కూడా చ‌దవండి : ఈ ఫోటోలో ఉన్న బాలిక తెలుగులో స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఆమె నటించిన ఈ సీన్ చూస్తే ఫిదా అవుతారు..!!

Visitors Are Also Reading