టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత నాగచైతన్య గతేడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల ముందే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టినా ఇద్దరు స్పందించలేదు. మీడియా ప్రశ్నించినప్పటికీ సమంత ప్రశ్నలను దాటవేశారు. కానీ చివరికి ఈ జంట సోషల్ మీడియా ద్వారా విడాకులు ప్రకటించారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఇప్పటి వరకు తెలియదు. కానీ నెట్టింట పలు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
Advertisement
నాగచైతన్య మరో హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడం వల్లే సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వార్తలు వినిపించాయి. మరోవైపు సమంత వల్లే ఇద్దరు విడాకులు తీసుకోవాల్సివచ్చిందని కూడా వార్తలు వినిపించాయి. సమంత కుటుంబాన్ని పక్కనపెట్టి సినిమాలతో బిజీగా ఉంటుందని అందువల్లే అక్కినేని ఫ్యామిలీ సమంత కు విడాకులు ఇచ్చిందని వార్తలు వినిపించాయి.
Advertisement
Also Read: వైసీపీ నేతలతో బాలయ్య పీఏ పేకాట.. అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు
మరోవైపు సమంత కొన్ని సినిమాలు.. వెబ్ సిరీస్ లలో ఎక్స్పోజ్ చేయడం కూడా అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదని వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా వీరిద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. అయితే విడాకులు తీసుకున్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో నాగచైతన్య సమంతను ఫాలో అవుతున్నారు.
కానీ సమంత మాత్రం ఇప్పటికే తన ఇన్స్టాగ్రామ్ లో నాగచైతన్య ఫోటోలను డిలీట్ చేసింది. అంతేకాకుండా చైతూ బంధువులు తండ్రి నాగార్జున. బంధువులు వెంకటేష్ కూతురు అశ్రిత, రానాను మాత్రం సమంత ఇప్పటికీ ఫాలో అవుతుంది. సమంత తనను అన్ ఫాలో చేసినప్పటికీ చైతూ మాత్రం ఫాలో చేస్తూనే ఉన్నారు. అంతే కాకుండా సమంతతో దిగిన ఫోటోలను కూడా ఇప్పటివరకు డిలీట్ చేయలేదు.
Also Read: కికోతో కేటీఆర్ పోటో.. ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్