Home » రెండో పెళ్లి చేసుకున్న స‌మంత‌..? ఆ తాళి వెన‌క దాగున్న నిజం ఏంటంటే..?

రెండో పెళ్లి చేసుకున్న స‌మంత‌..? ఆ తాళి వెన‌క దాగున్న నిజం ఏంటంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఎప్పుడూ ఏదో ఒక‌రకంగా వార్త‌ల్లో నిలుస్తోంది. స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ నాటి నుండి స‌మంత వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి విడిపోక‌ముందే విడాకుల వార్త‌లు రావ‌డంతో స‌మంత పేరు వార్త‌ల్లో హెడ్ లైన్ గా మారింది. ఆ త‌ర‌వాత స‌మంత ఏం చేసినా పేరు వార్త‌ల్లో మారుమోగిపోతోంది.

Advertisement

అప్ప‌ట్లో స‌మంత విడాకుల‌కు ర‌క‌ర‌కాల కార‌ణాలు బ‌య‌ట వినిపించాయి. స‌మంత పిల్ల‌ల‌ను క‌న‌డానికి నిరాక‌రిస్తుంద‌ని అందుకే ఇద్ద‌రూ విడిపోయార‌ని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే గ‌త కొద్దిరోజులుగా స‌మంత రెండో పెళ్లి చేసుకుందంటూ వార్త‌లు గుప్పుమంటున్న సంగ‌తి తెలిసిందే. అలా వార్త‌లు రావ‌డానికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. స‌మంత మెడ‌లో ప‌సుపుతాడు తో క‌నిపించ‌డ‌మే వార్త‌ల‌కు అస‌లు కార‌ణం అయ్యింది.

Advertisement

ALSO READ : కనీస అర్హత లేని చిత్రాలు ఆస్కార్ కు పోతున్నాయి.. AR రెహమాన్ కామెంట్స్ వైరల్ ..!!

దాంతో స‌మంత రెండో పెళ్లి గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపించాయి. స‌మంత ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుంద‌ని అందువ‌ల్లే మెడ‌లో ప‌సుపు తాడు క‌ట్టుకుందని టాక్ వినిపించింది. అదేవిధంగా నాగ‌చైత‌న్య‌కు కూడా అందుకే విడాకులు ఇచ్చింద‌ని కూడా టాక్ మొద‌ల‌య్యింది.

అయితే తాజాగా ఆ వార్త‌ల‌న్నీ ఫేక్ అని తేలిపోయింది. స‌మంత ప్ర‌స్తుతం కుషి సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవ‌రకొండ‌కు జోడీగా స‌మంత న‌టిస్తోంది. కాగా ఈ సినిమాలో ఓ పెళ్లి సీన్ ఉంద‌ట‌. అయితే ఈ సీన్ కోస‌మే సమంత మెడ‌లో ప‌సుపు తాడును క‌ట్టుకుంద‌ట‌.

ALSO READ : Kabzaa Review Telugu : కబ్జా మూవీ రివ్యూ..మొత్తం KGF ను దించేశాడా ?

Visitors Are Also Reading