Home » నాగ‌చైత‌న్య జ్ఞాపకాల‌ను చెరిపేయ‌లేక‌పోతున్న స‌మంత‌…అందుకే అలా చేసిందా..?

నాగ‌చైత‌న్య జ్ఞాపకాల‌ను చెరిపేయ‌లేక‌పోతున్న స‌మంత‌…అందుకే అలా చేసిందా..?

by AJAY
Ad

ప‌చ్చ‌బొట్టు ఒక‌ప్పుడు వ్యాధులు రాకుండా వేసుకుంటే ఇప్పుడు ఫ్యాష‌న్ కోసం వేసుకుంటున్నారు. త‌ల నుండి పాదాల వ‌ర‌కూ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ స్టైల్ కోసం టాటూలు వేసుకుంటున్నారు. ఇక చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన ప్రేమించే వ్య‌క్తుల పేర్ల‌ను టాటూలుగా వేసుకుంటూ ఉంటారు. త‌మ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డానికి టాటూ కూడా ఇప్పుడు ఒక మార్గంలా మారిపోయింది.

Advertisement

ఇక టాలీవుడ్ సెల‌బ్రెటీల‌ల కూడా చాలా మంది టాటూలు వేయించుకున్న సంగ‌తి తెలిసిందే. అందులో హీరోయిన్ సమంత కూడా ఒక‌రు. స‌మంత శ‌రీరం పై రెండు చోట్ల ప‌చ్చ‌బొట్లు ఉన్నాయి. అయితే ఆ రెండు ప‌చ్చ‌బొట్ల‌కు కూడా త‌న మాజీ భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో లింక్ ఉండ‌టం విశేషం. స‌మంత చేతి పై ఒక ప‌చ్చబొట్టు ఉంటుంది. కాగా అచ్చం అలాంటి టాటూ నే నాగ‌చైత‌న్య చేతి పై కూడా మ‌న‌కు క‌నిపిస్తుంది.

Advertisement

ఇప్ప‌టికీ స‌మంత చైతూల చేతుల పై ఆ ప‌చ్చ‌బొట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది. అంతే కాకుండా స‌మంత న‌డుముకు కాస్త పైన కుడి వైపు కూడా ఒక ప‌చ్చ బొట్టు వేసుకుంది. ఆ ప‌చ్చ‌బొట్టు నాగ‌చైత‌న్య పేరు షార్ట్ క‌ట్ లో రాసి చై అని ఉంటుంది. అయితే భ‌ర్త‌తో విడాకుల త‌ర‌వాత స‌మంత ఆ ప‌చ్చ‌బొట్టును చెరిపేసుకుంద‌ని అంతా అనుకున్నారు.

చైత‌న్య జ్ఞాపకాలు త‌న వ‌ద్ద లేకుండా చేసుకోవాల‌ని స‌మంత అలా చేసింద‌నుకున్నారు.కానీ స‌మంత ఆ ప‌చ్చ‌బొట్టును రిమూవ్ చేయ‌లేద‌ని తాజా ఫోటోల‌లో క‌నిపిస్తుంది. తాజాగా సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కోసం లండ‌న్ లో ప్రీమియ‌ర్స్ కు వెళ్ల‌గా అక్క‌డ దిగిన ఫోటోల‌లో స‌మంత న‌డుం పై ప‌చ్చ‌బొట్టు ఆన‌వాళ్లు క‌నిపిస్తున్నాయి. దాంతో మేక‌ప్ తో క‌వ‌ర్ చేసిన‌ట్టు అర్థ‌మౌతోంది.

ALSO READ :Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Visitors Are Also Reading