Home » కొత్త గెటప్ లో సమంత… సన్యాసం తీసుకుందా?

కొత్త గెటప్ లో సమంత… సన్యాసం తీసుకుందా?

by Bunty
Ad

అక్కినేని నాగచైతన్య మాజీ సతీమణి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత.. సమంత సినిమాలలో జోరును పెంచింది. యశోద, సిటాడల్, శకుంతలం, ఖుషి లాంటి సినిమాలు చేసింది సమంత. ఇక విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ఖుషి.

Advertisement

ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఖుషి సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తికాగా.. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక అటు… ఖుషి సినిమా షూటింగ్ పూర్తికాగానే సమంత కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఏడాది పాటు సినిమాలకు సమంత దూరంగా ఉంటుందని.. అప్పటివరకు ఎలాంటి సినిమాలు చేయకూడదని సమంత నిర్ణయం తీసుకుందట. ఇక ఇప్పటివరకు ఒప్పుకున్న.. సినిమాల రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేసింది అంట సమంత. అలా దాదాపు 12 కోట్ల వరకు తిరిగి ఇచ్చిందని సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఇక ఈ తరుణంలోనే తాజాగా సమంత… ఓ డిఫరెంట్ గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అచ్చం సన్యాసం తీసుకున్న వారిలా… కొత్త గెటప్ లో దర్శనమిచ్చింది సమంత. తాజాగా తమిళ నాడు లోని కోయంబత్తూర్ లో ఉన్నటువంటి ఈశా ఫౌండేషన్ కు సమంత వెళ్ళింది. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ధ్యానం చేసింది సమంత. దీనికి సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలను చూసిన నేటిజెన్లు తమకు నచ్చిన విధంగా స్పందిస్తున్నారు. సమంత సన్యాసం తీసుకోబోతుందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading