Home » చేతిలో రుద్రాక్ష‌తో ద‌ర్శ‌నం ఇచ్చిన‌ స‌మంత‌….కార‌ణం అదేనా..?

చేతిలో రుద్రాక్ష‌తో ద‌ర్శ‌నం ఇచ్చిన‌ స‌మంత‌….కార‌ణం అదేనా..?

by AJAY
Ad

స‌మంత సౌత్ ప్రేక్షకుల‌కు ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. పుష్ఫ‌, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ల‌తో నార్త్ లోనూ స‌మంత అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ లోనూ ఆఫ‌ర్ ల‌ను అందుకుంటుంది. సాధార‌ణంగా హీరోయిన్ ల‌కు హీరోల రేంజ్ లో అభిమానులు ఉండ‌టం అరుదుగా కనిపిస్తుంది. కానీ స‌మంత‌కు మాత్రం హీరో రేంజ్ లో క్రేజ్ ఉంద‌ని చెప్ప‌డం లో డౌట్ అవ‌స‌రం లేదు.

Advertisement

స‌మంత సినిమా వ‌చ్చినా..ఏదైనా ఈవెంట్ లో పాల్గొన్నా ఆ రోజు ట్విట్ట‌ర్ లో డ్రెండ్ అవ్వాల్సిందే. కేవలం స‌మంత కోస‌మే సినిమాకు వెళ్లే అభిమానులు సైతం ఉన్నారంటే సామ్ క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. అయితే స‌మంత కు వ‌రుస స‌క్సెస్ లు వ‌స్తున్నా ఆమె అదృష్టం మాత్రం భాగాలేద‌నే చెప్పాలి. వ‌రుస‌గా ఆఫ‌ర్ లు అందుకుంటున్న స‌మ‌యంతో స‌మంత మ‌యోసైటిస్ భారిన ప‌డ‌టంతో సినిమాల‌కు కాస్త బ్రేక్ అవ్వాల్సి వ‌చ్చింది.

Advertisement

ఇదిలా ఉంటే స‌మంత అనారోగ్యం భారిన‌ప‌డ‌టంతో ఆధ్యాత్మిక‌చింత‌న‌లోకి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా స‌మంత ఆమె న‌టించిన శాకుంత‌లం సినిమా ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో చేతిలో రుద్రాక్ష‌తో స‌రికొత్త లుక్ లో క‌నిపించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇటీవ‌ల స‌మంత ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట ప‌డిన‌ప్పుడు కూడా చేతిలో రుద్రాక్ష తోనే క‌నిపించింది. దాంతో సామ్ ఆధ్యాత్మిక‌త వైపు అడుగులు వేస్తుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా అనారోగ్యం నుండి బ‌య‌ట‌ప‌డ‌టం మ‌రియు జీవితంలో వ‌చ్చిన క‌ష్టాలు పోవ‌డానికే స‌మంత అధ్యాత్మిక‌త వైపు చూస్తోంద‌ని కూడా ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading