టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల కాలంలో నిత్యం వార్తలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత లైఫ్ ను పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. సాధారణంగా పెళ్లిళ్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు కానీ సమంత విషయంలో మాత్రం అది రాంగ్ అని ప్రూవ్ అయింది.
విడాకుల తర్వాత సమంత శాకుంతలం, యశోద చిత్రాలతో పాటు బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలకు కూడా కమిట్ అయింది. విడాకుల తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి ఐటమ్ సాంగ్స్ చేయడం అందాల ఆరబోత చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ లో నటించడం వలనే విభేదాలు వచ్చాయని దానివల్లే విడాకులకు దారి తీసింది అని వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. సమంత నటించిన యశోద చిత్రం నవంబర్ 11న విడుదల కానుండగా.. ఈ సినిమా ప్రమోషన్ లో సమంత పాల్గొనబోతుందట ఆ సమయంలో అక్కినేని ఫ్యామిలీ తనని ఎంత ఇబ్బంది పెట్టారనేది క్లియర్ గా వివరించనున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
Advertisement
Advertisement
దీపావళి తర్వాత నుంచి సమంత తన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, యశోద చిత్రంపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ మూవీ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంకల కృష్ణ ప్రసాద్ నిర్మిస్తుండగా హరి -హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ లో సమంత గర్భవతిగా కనిపిస్తోంది. అయితే ఈ చిత్రం గురించి ప్రస్తుతం ఓ వార్త చెక్కర్లు కొడుతోంది.