Telugu News » Blog » Pooja Hegde : పూజ హెగ్డే ఇంట పెళ్లి సందడి… బుట్ట బొమ్మ ఎమోషనల్ నోట్

Pooja Hegde : పూజ హెగ్డే ఇంట పెళ్లి సందడి… బుట్ట బొమ్మ ఎమోషనల్ నోట్

by Bunty
Ads

టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. ఈమె తొలిసారి ముకుందా సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా విడుదల అవ్వడంలో ఆలస్యం కావడంతో ఆ వెంటనే అక్కినేని హీరో నాగచైతన్యతో నటించిన ఒక లైలా కోసం సినిమాతో ఈమె తెలుగు తెరకు పరిచయమైందనే చెప్పాలి. ఆనతి కాలంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కాగా పూజ ముంబైలో పుట్టి పెరిగింది. ఈమెకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. కాగా పూజ హెగ్డే సోదరుడు వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. శివాని శెట్టి అనే మహిళను ఆయన వివాహం ఆడారు.

Advertisement

పెళ్లికి సంబంధించి అన్ని తానే చూసుకుంది బుట్ట బొమ్మ పూజ హెగ్డే. వారం రోజుల పాటు ఆ పెళ్లి వేడుకలో మునిగి తేలింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ రిషబ్ హెగ్డే పెళ్లి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేసింది. ఎప్పుడూ లేనంత సంతోషాన్ని ఈ పెళ్లితో పొందానంటూ ఎమోషనల్ అయింది. “నా సోదరుడు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

Pooja Hegde about Her Brother Marriage Event

ఈ వేడుక ప్రారంభం నుంచి నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నాను. చిన్నపిల్లల నవ్వేశా. ఆనందభాష్పాలు వచ్చాయి” అంటూ ఎమోషనల్ అయింది పూజ. దీంతో కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ తారలు, నెటిజెన్లు, అభిమానులు. ఇక ప్రస్తుతం పూజ తెలుగులో మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతోంది. మరోవైపు బాలీవుడ్ లో సల్మాన్ తో ఓ చిత్రంలో నటిస్తోంది.

Advertisement

READ ALSO : U19 women’s worldcup : అండర్-19 మహిళా టి20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా