టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులు ప్రకటించిన విషయం విధితమే. వారు విడాకుల విషయం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
తొలుత సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్నారని తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే వీరిద్దరూ అధికారికంగా ఓ ప్రకటన చేయడంతో విడాకులు కన్ఫర్మ్ అయినట్టు స్పష్టమైంది. ఈ ఇష్యూపై అప్పట్లో రకరకాల వార్తలు వినిపించాయి. ఇక విడాకులు తీసుకోవడానికి కారణాలు ఇవే అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంగా తాజాగా సమంత ఫస్ట్ టైమ్ పెళ్లి బంధం గురించి ఓపెన్ అయింది. పెళ్లి తరువాత జీవితంపై ఉండే ఎక్స్పెక్టేషన్స్ గురించి కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. తాజాగా కాఫీ విత్ కరణ్ ప్రోమో విడుదల చేయగా.. అందులో సమంత చేసిన కామెంట్లు వైరలవుతున్నాయి. కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్లో సమంత పార్టిసిపేట్ చేసింది.
Advertisement
Advertisement
ఇక ఈ సీజన్ వచ్చే వారం నుంచి హాట్ స్టార్‌లో ప్రసారం కానున్నది. కొద్ది సేపటి క్రితం ఈ షో ప్రోమో విడుదల చేయడంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అవ్వనుంది. ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సమంత కనిపించారు.ఇందులో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అలియా భట్ వంటి స్టార్స్ కనిపించారు. సమంత పెళ్లి గురించి చెప్పిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెళ్లి అయిన తరువాత జీవితం మనం అనుకున్నంత సంతోషంగా ఉండకపోవడానికి కారణం కరణ్ జోహార్‌తో మీరే అని చెప్పడం విశేషం.
పెళ్లి తరువాత జీవితం కభీ ఖుషీ కబీ ఘమ్లా ఉంటుందని చూపించారు. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం డిఫరెంట్ ఉంది. పెళ్లి తరువాత లైఫ్ కేజీఎఫ్‌లా ఉంటుందని పరోక్షంగా సమంత తన మ్యారేజ్ లైఫ్ పై కౌంటర్ వేసుకుంది. దీంతో ఈ కామెంట్స్ జనాల్లో హాట్ టాఫిక్ అవుతున్నాయి. మొత్తానికి తొలిసారి సమంత ఇలా ఒక షోలో తన పెళ్లి విడాకుల వంటి విషయాల మీద నోరు విప్పబోతుందని ఈ ప్రోమో స్పష్టం చేస్తుంది. సమంత ఏం చెప్పబోతుందనేది చూడాలి మరి.
Also Read :
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి నరేష్ భార్య రమ్య వరుసకు ఏమవుతుందో తెలుసా..?
విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ అయిన 5గురు టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!