మొదట సినిమాల్లో హీరోగా నటించి ఆ తరవాత విలన్ పాత్రలు చేసేవారు చాలా మంది ఉంటారు. కానీ మొదట విలన్ గా నటించి ఆ తరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు మాత్రం అతితక్కువ మంది ఉంటారు. ఇక టాలీవుడ్ లో అలా కొంతమంది హీరోలు మొదట విలన్ పాత్రలు వేసి మెప్పించారు. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం…
మెగాస్టార్ చిరంజీవి కూడా మొదట ఇది కథ కాదు, మెసగాడు సహా మరికొన్ని సినిమాల్లో విలన్ గా నటించాడు. ఆ తరవాత చిరు టాలెంట్ చూసి హీరో అవకాశాలు ఇస్తే ప్రస్తుతం ఇండస్ట్రీనే ఏలే స్థాయికి ఎదిగాడు.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్వర్గం నరకం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మోహన్ బాబు కూడా కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ విలన్ గా రానించాడు. ఆ తరవాత హీరోగా కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు.
మ్యాచో మ్యాన్ గోపిచంద్ తొలివలపు సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా అనుకున్న మేర సక్సెస్ అవ్వలేదు. కానీ జయం సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరవాత హీరోగానూ సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు.
హీరో రాజశేఖర్ కూడా కెరీర్ మొదట్లో తలంబ్రాలు సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాలో తన నటనకు నంది అవార్డును సైతం అందుకున్నాడు. ఆ తరవాత హీరోగా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
జేడీ చక్రవర్తి కూడా కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. కానీ ఆ తరవాత హీరోగా విలన్ గానూ సినిమాలు చేస్తున్నాడు.