Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » నా కలలన్నీ చెదిరిపోయాయి.. వచ్చే ఏడాది పై ఆశల్లేవు…సమంత ఎమోషనల్…!

నా కలలన్నీ చెదిరిపోయాయి.. వచ్చే ఏడాది పై ఆశల్లేవు…సమంత ఎమోషనల్…!

by AJAY
Ads

టాలీవుడ్ బ్యూటీ సమంత నాగచైతన్య తో విడాకుల తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. ఏకంగా పాన్ ఇండియా ప్రాజెక్టులో తాను కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమానే కాకుండా హాలీవుడ్ సినిమాకు సైతం సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా సమంత ఎక్కువ యాక్టిివ్ గా కనిపిస్తోంది. నిజానికి ముందు నుండి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అయితే చైతూ తో విడాకుల తర్వాత మాత్రం జీవితానికి సంబంధించిన అంశాలు… ఎమోషనల్ కొటేషన్లను షేర్ చేస్తున్నారు. కాగా రీసెంట్ గా సమంత విడాకుల తర్వాత తాను చనిపోతా అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

Samnatha nagachaitanya

Samnatha nagachaitanya

తాను చాలా ఎమోషనల్ పర్సన్ అని సోషల్ మీడియాలో తనపై వచ్చే రూల్స్ ను తట్టుకోలేక చనిపోతానేమో అని భయపడ్డానని సమంత చెప్పింది. ఇది ఇలా ఉండగానే సమంత మరోసారి షాకింగ్ కామెంట్ చేసింది. తాజాగా ఓ సెలబ్రిటీ లైవ్ చిట్ చాట్ లో పాల్గొన్న సమంత… 2021లో తన కలలన్నీ చెదిరిపోయాయి అంటూ భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రొల్స్ పై స్పందిస్తూ అసభ్యకర కామెంట్లు తనను బాదిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది పై ఎలాంటి ఆశలు పెట్టుకోలేదనీ… నా కోసం కాలం ఏది రాసి పెట్టినా ధైర్యంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

Ad

BIGG BOSS- 5: స‌న్నీకి నేను అత్త‌ను…నా కూతురును ఇద్దామ‌నుకున్నా కానీ : ఉమాదేవి

విడాకులకు కారణం సమంతే అంటూ పలువురు ఆమెపై విమర్శలు కురిపించారు. సమంత పిల్లలను కనేందుకు నిరాకరించిందని, కుటుంబాన్ని పట్టించుకోకుండా సినిమాలతో బిజీ అయ్యిందని అంతేకాకుండా నాగచైతన్య ఫ్యామిలీ మాన్ 2 లాంటి వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించేందుకు ఒప్పుకోలేదని కానీ సమంత వద్దన్నవి కూడా చేసిందని విమర్శించారు. అందువల్లే ఇద్దరికీ విడాకులు అయ్యాయని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత ఆ విమర్శలపై చాలా బాధపడ్డా అని చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading