Home » BIGG BOSS- 5: స‌న్నీకి నేను అత్త‌ను…నా కూతురును ఇద్దామ‌నుకున్నా కానీ : ఉమాదేవి

BIGG BOSS- 5: స‌న్నీకి నేను అత్త‌ను…నా కూతురును ఇద్దామ‌నుకున్నా కానీ : ఉమాదేవి

by AJAY
Ad

బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన వీజే స‌న్నీకి ఇప్పుడు ఎంతో పాపులారిటీ వ‌చ్చింది. స‌న్నీ మా మ్యూజిక్ లో వీజేగా చేసి ఎంతోమందిని ఆక‌ట్టుకున్నాడు. యాంక‌ర్ గా కెరీర్ మొద‌లు పెట్టిన స‌న్నీ ఇప్పుడు బిగ్ బాస్ వ‌ర‌కూ ఎదిగి టాప్ 5లో ఉన్నాడు. అంతే కాకుండా బిగ్ బాస్ టైటిల్ కూడా స‌న్నీదే అంటూ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే స‌న్నీ సీరియ‌ల్స్ లో కూడా హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌లు టీవీ సీరియ‌ల్స్ లో హీరోగా న‌టించి స‌న్నీ ఆక‌ట్టుకున్నాడు. ఇక ఓ సీరియ‌ల్ లో స‌న్నీకి అత్త‌గా న‌టించిన న‌టి ఉమాదేవి కూడా బిగ్ బాస్ 5 లోకి ఎంట్రీ ఇచ్చింది.

bigg boss umadevi comments on sunny

bigg boss umadevi comments on sunny

ఆ విష‌యాన్ని వీరిద్ద‌రూ హౌస్ లో ఎప్పుడూ షేర్ చేయ‌లేదు గానీ ఎలిమేనేట్ అయ్యిన త‌ర‌వాత ఉమ బ‌య‌టపెట్టింది. ఇక తాజాగా ఉమా అలియాస్ అర్ధ‌పావు భాగ్యం స‌న్నీపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. స‌న్నీతో క‌లిసి తాను సీర‌య‌ల్ చేసానని ఆ సీరియల్ లో స‌న్నీకి అత్త‌గా న‌టించాన‌ని చెప్పింది. అంతే కాకుండా స‌న్నీ విజే అనే విష‌యం త‌న‌కు ముందు తెలియ‌దు అని త‌న పెద్ద కూతురు చెప్పింద‌ని పేర్కొంది. స‌న్నీ మా మ్యూజిక్ లో వచ్చేవాడు వీజే అని చెప్పింద‌ని తెలిపింది. దాంతో తాను ఆ విష‌యం స‌న్నీని అడిగితే అత‌డు కూడా అవును అని ఆన్స‌ర్ ఇచ్చాడ‌ని పేర్కొంది.

Advertisement

Advertisement

also read :మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్న క‌రాటే క‌ళ్యాణి ?

అంతే కాకుండా స‌న్నీని చూడ‌గానే త‌న పెద్ద‌కూతురుకు ఇచ్చి వివాహం చేయాల‌ని కూడా మ‌న‌సులో అనుకున్న‌ట్టు వెల్ల‌డించింది. కానీ అంత‌లోనే త‌న కూతుర్లు వ‌చ్చి స‌న్నీ అన్న‌య్యా అంటూ మాట్లాడార‌ని చెప్పింది. దాంతో స‌న్నీ కూడా అప్ప‌టి నుండి త‌న ఇద్ద‌రి కూతుళ్ల‌ను పెద్ద చెల్లి చిన్న చెల్లి అని పిలుస్తాడ‌ని తెలిపింది. అలా తాను అల్లుడు చేసుకుందామ‌ని అనుకుంటే త‌న కూతురు అన్నా పిలిచింద‌ని దాంతో తాను కూడా లైట్ తీసుకున్నాన‌ని చెప్పింది. ఇక బిగ్ బాస్ లో సన్నీ భాగా ఆడుతున్నాడ‌ని..అత‌డే టైటిల్ గెలుస్తాడ‌ని చెప్పింది.

Visitors Are Also Reading