Home » ఎప్పుడూ దాన్ని నెగిటివ్ గా చూడను: సమంత

ఎప్పుడూ దాన్ని నెగిటివ్ గా చూడను: సమంత

by Sravanthi
Ad

సమంత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సమంత ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. మొన్నటిదాకా మాయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. సమంత ఇప్పుడు మళ్ళీ బిజీ అవ్వడానికి చూస్తోంది. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే కాకుండా ఏదో ఒక వార్తలో నిలుస్తూ వస్తోంది సమంత. అందులో భాగంగా తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఐఎండిబి విడుదల చేసిన మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.

samantha

Advertisement

సమంత ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ తో పాటుగా సౌత్ స్టార్స్ ని వెనక్కి నెట్టి సమంత ఏకంగా 13వ స్థానంలో చోటు తగ్గించుకుంది. ఈ విషయంపై తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడి ఆసక్తికరమైన విషయాలను సమంత పంచుకుంది. తనకు దక్కిన గుర్తింపుతో మరింత బాధ్యత పెరుగుతుందని ఆమె చెప్పింది. ఐఎండీబీ ర్యాంకింగ్ లో 13వ స్థానంలో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందని నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇది అని ఆమె చెప్పారు. కెరీర్ ని ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినట్లుగా ఉంది.

Advertisement

Also read:

Also read:

అప్పుడే ఇన్నేళ్లు గడిచిపోయాయా అని ఆశ్చర్యంగా ఉందని సమంత చెప్పింది. ఈ విషయం గురించి నమ్మలేకపోతున్నానని, ఇండస్ట్రీలో పోటీ వలన మంచి జరుగుతుందని నేను భావిస్తున్నానని ఆమె అన్నారు ఇండస్ట్రీలో ఉన్న పోటీని నేను ఎప్పుడు కూడా నెగిటివ్ గా చూడను. నాకు పోటీ అనేది మరింత స్ఫూర్తిని ఇస్తుందని సమంత చెప్పారు. ఇతరులను చూసి నేర్చుకుంటాను తప్ప నెగిటివ్ గా ఆలోచించి కెరియర్ లో నష్టపోనని అని అన్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

Visitors Are Also Reading