Home » విడాకుల త‌ర‌వాత దారుణ‌మైన‌ ప‌రిస్థితులు…వైర‌ల్ అవుతున్న సమంత కామెంట్స్..!

విడాకుల త‌ర‌వాత దారుణ‌మైన‌ ప‌రిస్థితులు…వైర‌ల్ అవుతున్న సమంత కామెంట్స్..!

by AJAY

అక్కినేని వార‌సుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నాగ‌చైత‌న్య‌. ఇండ‌స్ట్రీలో ల‌వ‌ర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న నాగ‌చైత‌న్య వరుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతున్నాడు. రీసెంట్ గా బంగార్రాజు సినిమాల‌తో తండ్రితో క‌లిసి న‌టించి మ‌రో హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాలోనూ నాగ‌చైతన్య కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

 

ఇదిలా ఉండ‌గా నాగ‌చైత‌న్య గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం మాయ‌చేసావే సినిమాలో న‌టించాడు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే హీరోయిన్ స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. వీరిద్ద‌రూ ఐదేళ్ల ప్రేమాయ‌ణం త‌ర‌వాత వివాహం చేసుకున్నారు. గోవాలో ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మ‌ధ్య‌లో వీరి వివాహం జ‌రిగింది. అయితే స‌డెన్ గా వీరిద్ద‌రూ గ‌తేడాది డిసెంబ‌ర్ లో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌ర్నీ షాక్ కు గురి చేశారు.

samantha nagachaithanya

అయితే తాజాగా స‌మంత ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ‌ విడాకుల‌పై షాకింగ్ కామెంట్లు చేసింది. చైతూతో విడాకుల త‌రవాత తాను అత్యంత దారుణ‌మైన‌ ప‌రిస్థితులు ఎదురుకున్నా అంటూ కామెంట్లు చేసింది. 2021లో త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో జ‌రిగిన ప‌రిణామాల వ‌ల్ల ఎలాంటి అంచ‌నాలు లేకుండా పోయాయ‌ని ఎందుకంటే తాను ఎంతో జాగ్ర‌త్త‌గా రూపొందించుకున్న ప్ర‌ణాళిక‌ల‌న్నీ శిథిల‌మైపోయాయ‌ని స‌మంత పేర్కొంది.

Samantha nagachaitanya

Samantha nagachaitanya

భ‌విష్య‌త్ లో త‌న‌కు ఏదైనా సుర‌క్షితంగా అనిపిస్తుందో దాన్నే స్వీక‌రిస్తాన‌ని చెప్పింది. ఇదిలా ఉంటే స‌మంత విడాకుల త‌ర‌వాత కూడా ఎక్క‌డా జోష్ తగ్గ‌లేదు. వ‌ర‌స సినిమాల‌తో ఇండ‌స్ట్రీలో బీజీగా ఉంది. ఇటీవ‌లే పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ స్టెప్పులు వేసి అల‌రించింది. ఈపాట‌తో స‌మంత యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత శాకుంత‌లం అనే సినిమాలో న‌టిస్తోంది.

Visitors Are Also Reading