Home » గుర్తుపట్టలేని విధంగా సమంత.. అస‌లు కార‌ణం అదేనా..?

గుర్తుపట్టలేని విధంగా సమంత.. అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ న‌టీ స‌మంత ప‌రిచ‌యం లేని పేరు. దాదాపు అంద‌రికీ సుప‌రిచిత‌మే. స‌మంత ముఖ్యంగా నాగ‌చైత‌న్యతో విడాకులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఆమె పేరు సోష‌ల్ మీడియాలో నిత్యం వైర‌ల్ అవుతోంది. ఇక అప్ప‌టి నుంచి సినిమాల‌ను కూడా వేగ‌వంతంగా చేస్తోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తుంది స‌మంత‌. ఓ బేబీ, యూట‌ర్న్ వంటి సినిమాల‌తో పాటు తాజాగా య‌శోద సినిమాలో న‌టిస్తోంది. ఇక ఈ సినిమాలో రెమ్యున‌రేష‌న్ అధికంగానే తీసుకున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

స‌మంత గ‌త కొంత‌కాలంగా సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటుంది. కొత్త‌గా ఇంట‌ర్వ్యూలు అస‌లు ఇవ్వ‌డం లేదు. తాజాగా స‌మంతకి సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ముఖ్యంగా సామ గ‌త కొద్ది రోజులుగా చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంద‌ని వార్త రాగానే ఆమె మేనేజ‌ర్ ఖండించారు. అదేవిధంగా స‌మంత గ‌ర్భ‌సంచి తీయించుకున్న‌ద‌ని కూడా సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే సికింద్రాబాద్ లోని వేద పాఠ‌శాల‌లో ఆమె ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ఇక ఈ ఫోటోల్లో స‌మంత కొంచెం భిన్న‌మైన లుక్‌లో క‌నిపిస్తోంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి : రోబో సినిమాలో షారుక్ హీరో గా రజిని విలన్ గా పెట్టి సినిమా తీద్దాం అనుకున్న శంకర్ మళ్ళీ ఎందుకు మార్చేశారంటే ?

స‌మంత లుక్ పూర్తిగా మారిపోయింద‌ని.. అస‌లు ఆమెకు ఏమైంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది ఆమె ఆప‌రేష‌న్ చేయించుకోవ‌డం వ‌ల్లనే కొంద‌రూ కామెంట్లు పోస్ట్ చేయ‌గా.. మ‌రికొంద‌రూ నాగ‌చైత‌న్య‌ని బాధ‌పెట్టిన పాపాలు ఊరికేపోతాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. స‌మంత ఉన్న ఈ లుక్ మాత్రం ఎవ్వ‌రికీ న‌చ్చ‌లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా ఈ ఫోటో చూడగానే అస‌లు గుర్తుప‌ట్టలేని విధంగా ఉండ‌డంతో అభిమానులు తీవ్ర‌ నిరాశ‌కు గుర‌వుతున్నారు. ముఖ్యంగా స‌మంత త్వ‌ర‌గా ఇదివ‌ర‌కు ఎలా ఉందో అలా కావాల‌ని అభిమానులు కోరుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  య‌శోద సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading