Home » నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఉన్న ఇంటిని డ‌బుల్ రేటుకు కొనుగోలు స‌మంత‌.. అస‌లు కార‌ణం అదేనా..?

నాగ‌చైత‌న్య‌తో క‌లిసి ఉన్న ఇంటిని డ‌బుల్ రేటుకు కొనుగోలు స‌మంత‌.. అస‌లు కార‌ణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత గ‌త కొంత కాలంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుని విడాకులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే వీరు కేవ‌లం సోష‌ల్ మీడియాలో ఎవ‌రికీ వారు విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. కానీ అధికారికంగా మాత్రం కోర్టు నుంచి వీరు విడాకులు తీసుకోలేదు. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ లో వీరు విడాకులు తీసుకుంటున్నట్టు ఎప్పుడ‌యితే సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారో ఇక అప్ప‌టి నుంచి ఈ జంట గురించి ఏదో ఒక వార్త రాసిన హాట్ టాపిక్ గానే మారుతోంది. కొంద‌రూ స‌మంత బిహేవియ‌ర్ కార‌ణంగానే నాగ‌చైత‌న్య విడాకులు తీసుకున్నాడ‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

Advertisement

ఇక మ‌రికొంద‌రూ స‌మంత‌కు నాగ‌చైత‌న్య ఫ్రీ హ్యాండ్ ఇవ్వ‌డం లేద‌ని.. చాలా నిబంధ‌న‌లు పెడుతుండ‌డం ఇష్టం లేకనే ఇత‌ని నుంచి విడిపోయింద‌ని ఆరోప‌ణ‌లు వినిపించాయి. తాజాగా స‌మంత‌కు సంబందించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.నాగ‌చైత‌న్య‌తో క‌లిసి గ‌తంలో తాను ఉన్న ఇంటిని స‌మంత రూ.కోట్లు ఖ‌ర్చు చేసి మరీ ద‌క్కించుకుంద‌ట‌. స‌మంత‌, నాగ‌చైత‌న్య హైద‌రాబాద్‌లో ఎంతో ఇష్ట‌ప‌డి త‌మ ఇల్లు కొనుగోలు చేశార‌ని, పెళ్లి త‌రువాత ఆ ఇంట్లోనే ఉన్నార‌ని ఆ త‌రువాత వారిద్ద‌రూ క‌లిసి ఓ ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవ‌డంతో వాళ్లు ఉన్న ఇంటిని వేరే వారికి అమ్మేశార‌ని న‌టుడు ముర‌ళీ మోహ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు.

Advertisement

అమితు వారు కొనుక్కున్న ఇల్లు రీ మోడ‌లింగ్ చేయించేంత వ‌ర‌కు పాత ఇంట్లోనే రెంట్ కు ఉంటామ‌ని చెప్ప‌డంతో స‌మంత వాళ్ల ద‌గ్గ‌ర ఇల్లు కొనుక్కున్న వాళ్లు అంగీకారం తెలిపారు. ఈ లోపే స‌మంత, నాగ చైత‌న్య విడాకులు ప్ర‌క‌టించారు. ఇక ఆ త‌రువాత స‌మంత సొంత ఇంటి కోసం స‌మంత చాలా వెతికింది. కానీ ఆమెకు ఏ ఇల్లు న‌చ్చ‌లేద‌ని ముర‌ళీమోహ‌న్ వివ‌రించారు. దీంతో మ‌రోసారి స‌మంత త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి అంత‌కు ముందు ఉన్న ఇల్లే త‌న‌కు కావాల‌ని అడిగింద‌ని ముర‌ళీ మోహ‌న్ వెల్ల‌డించారు. నేను మీకు అమ్మాను మీరు వేరే వారికి అమ్మారు క‌దా నేనేం చేయ‌లేను అని ముర‌ళీ మోహ‌న్ అనడంతో ఆ ఇల్లు డ‌బ్బులు ఇచ్చి మ‌రీ చైత‌న్య‌తో క‌లిసి ఉన్న ఇంటిని స‌మంత మ‌ళ్లీ కొనుగోలు చేసింద‌ని ముర‌ళీ మోహ‌న్ తెలిపారు. ఇక ప్ర‌స్తుతం స‌మంత ఆ ఇంట్లోనే త‌న త‌ల్లితో క‌లిసి ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Also Read : 

అల్లు అర్జున్ కి లైఫ్ ఇచ్చిన ‘ఆర్య’ సినిమా వెనుకున్న ఇంత కథ ఉందా ? ఎన్ని స్టోరీలు రిజెక్ట్ అయ్యాయంటే ?

“సింహాద్రి” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను రిజెక్ట్ చేసిన‌ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

 

 

Visitors Are Also Reading