Home » “సింహాద్రి” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను రిజెక్ట్ చేసిన‌ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

“సింహాద్రి” లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను రిజెక్ట్ చేసిన‌ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్ గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్లాప్ ఎర‌గ‌ని ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా జ‌క్క‌న్న సినిమా అంటే మినిమ‌మ్ గ్యారెంటీ అన్న‌ట్టుగా మారిపోయింది. ఆయ‌న కెరీర్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ లు కావ‌డ‌మే విశేషం. ఇక జ‌క్క‌న్న‌కు ఇంభ‌డియా వ్యాప్తంగా వ‌చ్చిన క్రేజ్ తో ఆయ‌న సినిమాలో చిన్న పాత్ర దొరికినా చాలని అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు.

Advertisement

కానీ ఒక‌ప్పుడు జ‌క్క‌న్న నుండి ఆఫర్ వ‌చ్చినా కొంత‌మంది మిస్ చేసుకున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన మొద‌టి సినిమా స్టూడెంట్ నంబ‌ర్ 1 సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ త‌వ‌రాత వీరిద్ద‌రి కాంబినేష‌న్ లోనే మ‌ళ్లీ సింహాద్రి అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ అయ్యింది. అయితే నిజానికి ఈ సినిమా క‌థ‌ను టాలీవుడ్ లోని ఇద్ద‌రు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారు.

Advertisement

వాళ్లు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….జ‌క్క‌న్న మొద‌ట సింహాద్రి క‌థ‌ను ప్ర‌భాస్ తో చేయాల‌ని అనుకున్నాడట‌. దాంతో ప్ర‌భాస్ కు ఈ సినిమా క‌థ‌ను కూడా వినిపించాడ‌ట‌. కానీ ప్ర‌భాస్ మాత్రం సింహాద్రి సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశాడ‌ట‌. అంతే కాకుండా సింహాద్రి క‌థ బాల‌య్య బాబుకు చాలా భాగా సెట్ అవుతుంద‌ని కూడా రాజ‌మౌళి అనుకున్నార‌ట‌.

ఆయ‌నకు కూడా ఈ సినిమా క‌థ‌ను వినిపించార‌ట‌. కానీ బాల‌య్య మాత్రం ఈ సినిమా చేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదట‌. ఇక చివ‌ర‌గా జ‌క్క‌న్న ఇదే క‌థ‌ను ఎన్టీఆర్ కు వినిపించారు. ఈ సినిమా క‌థ ఎన్టీఆర్ కు తెగ న‌చ్చేసింది. దాంతో ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయారు. ఇక స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ త‌ర‌వాత సింహాద్రితో ఎన్టీఆర్ జ‌క్క‌న్న కాంబోలో మ‌రో సూప‌ర్ హిట్ ప‌డింది.

ALSO READ :  గోవిందా గోవిందా, శుభలగ్నం సినిమాలకి మధ్య ఇలాంటి సంబంధం ఉందా..?

Visitors Are Also Reading