Telugu News » Blog » షాకింగ్ న్యూస్…చైతూకు విడాకులు ఇచ్చినా అక్కినేని ఫ్యామిలీని విడిచిపెట్టని సమంత..!

షాకింగ్ న్యూస్…చైతూకు విడాకులు ఇచ్చినా అక్కినేని ఫ్యామిలీని విడిచిపెట్టని సమంత..!

by AJAY
Published: Last Updated on
Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. సమంత నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2017 లో సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకోగా 2021 లో విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో కానీ విడాకులు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే వీరిద్దరి విడాకులకు సమంత బిజీగా ఉండటమే అని కొన్ని వార్తలు రాగా మరోవైపు నాగచైతన్య ఓ హీరోయిన్ తో క్లోజ్ గా ఉండటమే అని కూడా వార్తలు వినిపించాయి.

Advertisement

samanta

అయితే ఇప్పటివరకూ అసలు మ్యాటర్. ఏంటి అన్నది మాత్రం బయటకు రాలేదు. ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య కు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నా అక్కినేని కుటుంబానికి మాత్రం దగ్గరగానే ఉంటోంది. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఓ వీడియో ను అఖిల్ సోషల్ మీడియా షేర్ చేశాడు.

Advertisement

Advertisement

అయితే ఆ పోస్ట్ కి సమంత లైక్ కొట్టింది. అక్కడితో ఆగకుండా బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే సమంత అనారోగ్యం భారిన పడిన సమయంలో పలువురు సోషల్ మీడియా ద్వారా ఆమె త్వరగా కోలుకోవాలని సపోర్ట్ చేశారు. కాగా హీరో అఖిల్ కూడా సమంత అనారోగ్యం తో ఉన్న సమయం లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక రీసెంట్ గా సమంత శాకుంతలం సినిమా టీజర్ పై హీరో సుమంత్ ప్రశంసలు కురిపించాడు. అయితే సమంత ఫ్యామిలీ తో క్లోజ్ గా ఉండటం వల్ల నాగచైతన్య కు విడాకులు ఇచ్చినా అక్కినేని ఫ్యామిలీ తో బంధాన్ని కొనసాగిస్తోంది అంటూ టాక్ వినిపిస్తుంది.

You may also like