Telugu News » Blog » నువ్వులేని జీవితం ఊహించ‌లేను..ఆ ఫోటో షేర్ చేసి స‌మంత ఎమోష‌న‌ల్..!

నువ్వులేని జీవితం ఊహించ‌లేను..ఆ ఫోటో షేర్ చేసి స‌మంత ఎమోష‌న‌ల్..!

by AJAY
Ads

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి త‌క్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మారింది. ఏం మాయచేసావే సినిమా త‌ర‌వాత వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. మహేశ్ బాబు, అల్లుఅర్జున్ రామ్ చ‌ర‌ణ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇలా స్టార్ హీరోలు అంద‌రి స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించి అల‌రించింది. అంతే కాకుండా తెలుగుతో పాటూ త‌మిళ సినిమాల్లోనూ న‌టించి అభిమానుల‌ను సంపాదించుకుంది.

samantha-akkineni

samantha-akkineni

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన సమంత ఏం మాయ చేసావే సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ కొన్నేళ్ల‌పాటూ ప్రేమించుకున్న త‌ర‌వాత 2016లో వివాహం చేసుకున్నారు. పెళ్లి త‌ర‌వాత కూడా స‌మంత సినిమాలు చేసింది. అంతే కాకుండా పెళ్లి త‌ర‌వాత సామ్ డ‌బుల్ జోష్ తో సినిమాలు చేసి అల‌రించింది.

samantha

samantha

అయితే 2021 డిసెంబ‌ర్ లో స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య విడిపోతున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇక విడాకుల‌కు కార‌ణం స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు న‌చ్చ‌ని కొన్ని సినిమాలు చేయ‌డ‌మే అని కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌కు వేరే హీరోయిన్ తో సంబంధాలు ఉన్నాయ‌ని అందువ‌ల్లే ఇద్ద‌రూ విడిపోయార‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

ఇక ఏది ఏమైనా విడాకుల త‌ర‌వాత స‌మంత ఆ ఒత్తిడి నుండి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఎక్కువ‌గా త‌న స్నేహితుల‌తో గ‌డుపుతూ చిల్ అవుతోంది. ఇక ప్ర‌స్తుతం మ‌రో వెకేష‌న్ లో ఉన్న స‌మంత త‌న స్నేహితురాలితో క‌లిసిన ఫోటోను షేర్ చేసి బెస్ట్ ఫ్రెండ్ అంటూ యాష్ టాగ్ ఇచ్చింది. అంతే కాకుండా ఈ ఫోటోకు నువ్వులేను జీవితాన్ని ఊహించ‌లేను అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.


You may also like