Home » గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Azhar
Ad
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తాజాగా విడుదల అయిన సినిమా గాడ్ ఫాదర్. అయితే ఆచార్య వంటి పెద్ద డిజాస్టర్ సినిమా తర్వాత చిరు నుండి ఈ సినిమా అనేది వచ్చింది. ఇక ఇది కూడా మూడేళ్ళ కిందటే వచ్చిన లూసిఫర్ సినిమా రీమేక్ కావడంతో ఇది కూడా ప్లాప్ అవుకున్నారు.. కానీ కథలో చాలా వరకు మార్పులు చెయ్యడం వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యింది.
అయితే ఈ మధ్యే చిరంజీవి ఏ సినిమా చేసిన ఒంటరిగా చేయడం లేదు. తనతో పాటుగా మరో హీరో కూడా ఆ సినిమాలో ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే ఆచార్య లో రామ్ చరణ్.. మరో సినిమాలో రవితేజను పెట్టుకున్నారు. ఇక ఈ గాడ్ ఫాదర్ సినిమాలో అయితే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ఉంచుకున్నారు చిరంజీవి.
అయితే సల్మాన్ కు అలాగే చిరంజీవికి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందొ అందరికి తెలుసు. అందుకే ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ ఎలాంటి రెమ్యునరేషన్ అనేది తీసుకోలేదు అని తెలుస్తుంది. కానీ రామ్ చరణ్ తొందరలోనే సల్మాన్ కు ఓ గిఫ్ట్ రూపంలో రెమ్యునరేషన్ అనేది ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 5 కోట్ల విలువైన కారును రామ్ చరణ్ తొందరలోనే సల్మాన్ ఖాన్ కు ఇవ్వనున్నాడు అని సమాచారం. అంటే ఈ సినిమాలో చేసినందుకు సల్మాన్ కు పరోక్షంగా 5 కోట్లు ముడుతున్నాయి అనేది అర్ధం అవుతుంది.

Advertisement

Visitors Are Also Reading