Home » salaar : సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సలార్ టీజర్..! ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ..!

salaar : సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న సలార్ టీజర్..! ప్రభాస్ ఫాన్స్ కి పండగే పండగ..!

by Mounika
Ad

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించగా, జగపతిబాబు, విజయసేతుపతి, మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్, శ్రియ రెడ్డి వంటి వారు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న సలార్ (salaar) కి సంబంధించిన టీజర్ ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అన్ని భాషలోను ఒకే టీజర్ రిలీజ్ కాగా.. సామాజిక మాధ్యమంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కు ఏకంగా 100 మిలియన్ల పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

Advertisement

ఒక విధంగా చెప్పాలంటే సలార్ టీజర్ సోషల్ మీడియాలో తుఫాన్ సృష్టించింది. అంతేకాకుండా మేకర్స్ సలార్ కి సంబంధించిన ట్రైలర్ ను ఆగష్టు నెలలో విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కొంతమంది నెటిజెన్స్ సలార్ టీజర్ గురించి నెగిటివ్ కామెంట్లు చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం సలార్ టీజర్ అదిరిపోయిందంటూ లైక్స్ కొట్టేస్తున్నారు. ఇక శృతిహాసన్ అభిమానులు ఆమె లేని టీజర్ ను అస్సలు చూడలేకపోతున్నాం అంటూ తెగ ఫీలవుతున్నారు.

Advertisement

salar sruthi hasan

salaar sruthi hasan

ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న టీజ‌ర్‌ను చూసి సినిమా గానీ విడుదలయితే.. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక కేజీఎఫ్ రికార్డులను సలార్ మూవీ తిరగ రాయడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా కేజీఎఫ్ 2 సినిమాకు లింక్ ఉందని కామెంట్లు వినిపిస్తుండగా.. సలార్ టీజ‌ర్‌లో ప్రేక్షకులు కోరుకున్న అంశాలు అన్నీ ఉన్నాయని, ఇక ప్రభాస్ అభిమానులకు పెద్ద పండగే అంటూ కామెంట్ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోయే సలార్ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రాదే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలతో ప్లాప్స్ ను అందుకున్న ప్రభాస్ కి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ అయినా అభిమానులు ఆశిస్తున్నట్లు విజయాన్ని అందిస్తుందా..లేదా అనే విషయం సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

నిహారిక పెళ్లికి నాగబాబు కట్నం ఎంత ఇస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

దళపతి విజయ్ దర్శకుడు విజయ్ గోపిచంద్ మలినేనితో ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తలుసా..?

కళ్యాణ్ రామ్, వశిష్ట మధ్య విభేదాలకు కారణం ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading