Home » Sai Pallavi: సాయిపల్లవికి ఉన్న ఈ విచిత్రమైన అలవాటు గురించి తెలుసా? అది కూడా తింటారా?

Sai Pallavi: సాయిపల్లవికి ఉన్న ఈ విచిత్రమైన అలవాటు గురించి తెలుసా? అది కూడా తింటారా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు అయినటువంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారం అయిన “ఢీ” డాన్స్ ప్రోగ్రాం తో అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకున్న సాయి పల్లవి మలయాళంలో “ప్రేమమ్” సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఆ సినిమాలో మలర్ గా నటించిన సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు.

Advertisement

తెలుగు నాట కూడా సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. గ్లామర్ కి దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలనే ఎంచుకునే సాయి పల్లవి అంటే అందరికీ ఇష్టమే. ఆమెకు హేటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. రానా సరసన గార్గీ సినిమాలో నటించిన సాయి పల్లవి ఆ తరువాత ఏ ఇతర సినిమాలకు సైన్ చేయలేదు. తరచుగా ఆధ్యాత్మికతతో గడిపే సాయి పల్లవి దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటుంది.

Advertisement

ఇటీవల ఓ తమిళ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి పల్లవి తనకి ఉన్న ఓ విచిత్రమైన అలవాటు గురించి చెప్పుకొచ్చింది. సాయి పల్లవికి విబూది తినే అలవాటు ఉందట. విబూది తినడం చాలా ఇష్టమట. ఎప్పుడైనా తినాలని అనిపిస్తే తినడం కోసం తన బాగ్ లో కొంచం విబూది పెట్టుకుని క్యారీ చేస్తూ ఉంటుందట. అది మామూలు విబూది కాదట. అది ఒక ప్రత్యేకమైన చెట్టుతో తయారు చేస్తారని, అది తినడానికి చాలా రుచిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనితో నెటిజన్స్ చాలా షాక్ అవుతున్నారు. ఇటువంటి అలవాట్లు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.

 

మరిన్ని ముఖ్యమైన వార్తలు :

విరూపాక్ష కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఆమె హీరోని డామినేట్ చేస్తుందని తీసేసారట..!

 ఏడేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ భోళా శంకర్ మూవీని మొదలు పెట్టాడనే విషయం మీకు తెలుసా ? 

Visitors Are Also Reading